వీరికి కోట్ల రూపాయల ధనం.. రివర్స్ లో తిరుగుతూనే ఇస్తానన్న బృహస్పతి
నిర్దిష్ట సమయం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలుగజేస్తాయి. ఇక నవగ్రహాలలో బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
బృహస్పతి తిరోగమన సంచారం
నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు రాత్రి 10 గంటల 11 నిమిషాలకు బృహస్పతి కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచారం చేస్తాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కావడంతో కర్కాటక రాశిలో గురువు తిరోగమనంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి, కర్కాటక రాశిలోకి ప్రవేశించి తిరోగమన సంచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే రాశులను తెలుసుకుందాం.

వృషభ రాశి
కర్కాటక రాశిలో గురువు తిరోగమనం వృషభ రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు సంతోషంగా ఉంటారు. వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి.
తులారాశి
తులా రాశి వారికి గురువు తిరోగమనం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏం చేసినా కలిసి వస్తుంది కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. తులా రాశి జాతకులు ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉంటారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గురువు తిరోగమనం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తారు. ఈ సమయం విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి గురువు తిరోగమన సంచారం అదృష్ట సమయంగా మారుతుంది. ఈ సమయంలో వీరు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ఇది మీన రాశి వారికి అన్ని విధాల కలిసొచ్చే సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications