Budh gochar 2024: మీనరాశిలో బుధాదిత్య రాజయోగం; మార్చిలో వీరికి పట్టిందల్లా బంగారం!!
మీనరాశిలో ఈ సంవత్సరం జరిగే ముఖ్య గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. 2024 సంవత్సరం మార్చి 7వ తేదీన ఉదయం 9.21 నిమిషాలకు బుధుడు మీన రాశిలోకి వెళ్లనున్నాడు. ఆపై మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక అదే రోజు మీనరాశిలో సూర్య బుధ సంయోగం కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
ఈ యోగం కారణంగా మూడు రాశుల వారు లబ్ధిని పొందుతారు. వృషభ రాశి వారికి 11వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన విజయం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మీ జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించ గలుగుతారు.

వృషభ రాశి వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో మీరు మంచి డబ్బును సంపాదించడమే కాకుండా, చాలావరకు ఆదా చేయగలుగుతారు.
కన్యా రాశి వారికి ఏడవ ఇంట్లో సూర్య బుధ సంయోగం జరుగుతుంది. కన్యా రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది.ఉద్యోగాలలోను, వర్తక వ్యాపారాలలో కన్యా రాశి వారికి ఈ సమయంలో మంచి పురోగతి ఉంటుంది. విదేశాలలో కార్యకలాపాలకు మంచి అవకాశం ఉంటుంది .ఈ సమయంలో డబ్బు ఆదా అవుతుంది. ఆర్థిక లాభాలతో పాటు, ఆనందంగా జీవించడానికి కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది.
మిధున రాశి వారికి పదవ ఇంట్లో సూర్య బుధ సంయోగం కనిపిస్తుంది. ఇది వారికి చాలా లాభాలను చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడిపే అవకాశాన్ని అందిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పనిచేసే అవకాశాలు లభించవచ్చు. ఈ సమయంలో అదృష్టం మీ పక్కనే ఉంటుంది. పనిలో ప్రశంసలను పొందుతారు .ఉన్నత చదువులకు కూడా ఇదే సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications