బుధ గోచారం 2024: ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం పడే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జులై నెలలో గ్రహాల గమనం ద్వాదశరాశుల వారి జీవితాలను ప్రభావం చేస్తుంది. జులై నెలలో సింహరాశిలోకి బుధ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.
గ్రహాల రాకుమారుడు బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జులై 19వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సొంత రాశి అయిన సింహరాశి లోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఇక ఆగస్టులో సూర్యుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు కావడంతో సింహరాశిలో బుధ గ్రహ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి
సింహరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా వృషభ రాశి వారికి సత్ఫలితాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.
కర్కాటక రాశి
బుధ గోచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు లబ్ది చేకూరుతుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం సుఖవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేపట్టిన విజయం చేకూరుతుంది.
సింహరాశి
సింహరాశిలో బుధ గ్రహ సంచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది.. కొత్త ఇంటిని కాని వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోదరులు సోదరీమణుల నుంచి ఊహించని మద్దతు దొరుకుతుంది ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి..
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు బుధ గ్రహగోచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు బుధగ్రహ గోచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది .పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి . వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది .పరీక్షలు రాసే వారికి ఇది శుభ సమయం .ఉద్యోగాలు చేసే చోట ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications