ఈ రాశులకు అఖండ ధనయోగాన్ని శాసిస్తున్న శుక్రుడు, బుధుడు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటాం. రాశులవారికి అనుకూలమైన గ్రహాలుగా పేరు తెచ్చుకున్న శుక్రుడు, బుధుడు తమ రాశులను మారుస్తున్నాయి. ఇలా మార్చే క్రమంలో అమ్మవారి అనుగ్రహం వల్ల నాలుగు రాశులవారికి అన్నీ శుభ ఫలితాలే ఎదురవుతున్నాయి. ఏ విధంగా వీరికి ప్రయోజనాలు కలుగుతున్నాయి? భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు అనే విషయాలను తెలుసుకుందాం.
మేష రాశి
వ్యాపారస్తులకు ఆదాయం పెరగడానికి ఇది మంచి సమయం. మనోధైర్యం పెరగడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. వివాహం కానివారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కొన్నాళ్లుగా అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరగడానికి కూడా ఈ సమయం తోడ్పడుతుంది.

మిథున రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు సానుకూల ఫలితాలే ఎదురవుతాయి. ఇష్టదైవాన్ని ధ్యానం చేయడంవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో వ్యాపారస్తులు కాస్త ఆలోచించి, ముఖ్యమైనవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి.
సింహ రాశి
ఖర్చుల వృథాను నివారించాలి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శారీరక, మానసిక బలం చేకూరుతుంది. వాహనాలకు రిపేర్లు చేయించాల్సి ఉంటుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఉద్యోగస్తులకు రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది. మానసిక ఒత్తిడిని గెలవాలి. కొత్త వ్యక్తులతో అయ్యే పరిచయం మీ జీవితానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
మీన రాశి
ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. యోగా, ధ్యానం చేయడంవల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యగోంలో పదోన్నతి ఉంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మానసికంగా ప్రశాంతతను పొందుతారు.












Click it and Unblock the Notifications