వారం రోజుల్లో వీరికి డబ్బుల మూటలను మోసుకొచ్చే బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా కలిగే యోగాలు అన్ని రాశుల వారికి శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే కొన్ని యోగాలు శుభయోగాలు కాగా, మరికొన్ని అశుభయోగాలు. ఇక ఆగస్టు నెలలో ఆగస్టు 16వ తేదీన గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు రాత్రి 7.53నిమిషాలకు కర్కాటకరాశి నుండి సింహరాశికి బదిలీ అవుతున్నాడు. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలోనే కొనసాగుతాడు.
రెండు శుభ రాజయోగాలు
ఇక సింహరాశిలో బుధుడు, శుక్రుడు ఇప్పటికే ఉండడంవల్ల ఈ రెండు గ్రహాలు సూర్యుడుతో కలిసి అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి. సూర్యుడు బుధుడు సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడితే, సూర్యుడు శుక్ర సంయోగం కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు రాజయోగాలు శుభయోగాలుగా చెబుతారు. ఈ రెండు రాజయోగాల వల్ల ఐదు రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది.

మేషరాశి
ఆగస్టు నెలలో సూర్య సంచారంతో కలిగే రాజయోగాల కారణంగా మేష రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మేష రాశి జాతకులు కెరీర్ లోనూ గొప్ప విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో కూడా సంపదల వర్షం కురుస్తుంది.
వృషభరాశి
ఆగస్టు నెలలో సూర్యసంచారం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా లబ్ధి జరుగుతుంది. కెరీర్ లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
సింహరాశి
సూర్య సంచారం కారణంగా ఏర్పడే రెండు రాజయోగాలు సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తాయి. ఈ సమయంలో సింహ రాశి వారు డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు. వీరి అదృష్టం ప్రకాశిస్తుంది. ఏ రంగంలోని వారి కైనా విజయం చేకూరుతుంది. ఏ పని చేసినా ఈ సమయంలో ఆశించిన ఫలితాలు వస్తాయి.
తులారాశి
ఆగస్టులో సూర్య సంచారం కారణంగా తులా రాశి వారి జీవితంలో శుభాలు చేకూరుతాయి. శత్రువులను జయిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి.
మీన రాశి
ఆగస్టులో సూర్య సంచారం కారణంగా ఏర్పడే బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు మీన రాశి వారికి లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమైన వారిని విజయాలు వరిస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలే వస్తాయి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications