నేటినుండి వీరికి మొదలైంది అఖండ రాజయోగం... ప్రకటించిన బుధ, సూర్యులు!
సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశులవారిని సంపన్నులను చేస్తున్నారు. ఒకే రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇక జనవరి 24వ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశించాడు.
బుధాదిత్య రాజయోగం
అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడుతో, బుధుడు సంయోగం చెంది నేటి నుండి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఫిబ్రవరి 11వ తేదీ వరకు మకర రాశిలోనే కొనసాగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా నేటి నుండి ఫిబ్రవరి 11 వరకు ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు ఆర్ధికంగా లబ్ది పొందుతారు. అన్ని విధాలుగా ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. పనిలో విజయాలు చేకూరుతాయి. వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి మంచి సమయం.
మకర రాశి
నేటినుండి మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి శుభాలు చేకూరుతాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆర్ధిక పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో బాగా లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
తులారాశి
తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. తులా రాశి వారి నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. పెట్టుబడికి, మంచి రాబడికి ఇది మంచి సమయం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా సానుకూలం.
కుంభరాశి
కుంభరాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా లబ్ది చేకూరుతుంది. ఆర్థిక విషయాలలోనూ, వృత్తి అవకాశాలలోనూ కుంభరాశి జాతకులు వృద్ధిని అనుభవిస్తారు. బుధాదిత్య రాజయోగం కుంభరాశి జాతకులకు మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వీరిలో ఉన్న కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి బాగుంటుంది. ఇది వీరికి అన్ని విధాలుగా మంచి చేస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications