హోలీ నాడే మీనరాశిలో బుధాదిత్య యోగం.. వీరికి రాసుంది రాజభోగం!

గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈనెల 14వ తేదీ నుండి మీన రాశిలో బుధుడు రవి కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా ఏప్రిల్ 15వరకు కొన్ని రాశులవారికి ధనయోగం పడుతుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వృషభ రాశి జాతకులకు ధనయోగం పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ పని చేసినా విజయవంతం అవుతారు. ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే వారికి శుభం జరుగుతుంది. మనసులో ఉన్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి.

budhaditya yoga in pisces on holi these zodiac signs will get kingsize life

మిధున రాశి
మిధున రాశిలో దశమ స్థానంలో బుధుడు రవి కలయిక జరిగే బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వీరికి కలిసొస్తుంది. మంచి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో రాణించే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలోనూ హోదా పెరుగుతుంది.

కన్య రాశి
బుధుడు, రవి సప్తమ స్థానంలో కలయిక జరగడం వల్ల కన్యారాశి జాతకులకు మంచి జరుగుతుంది. వీరి వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ఈ రాశికి భాగ్య మరియు దశమాధిపతి అయిన రవి బుధులు నాలుగవ స్థానంలో కలవడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభించడమే కాకుండా రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. ఇక ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలలోనూ కలిసొస్తుంది.

మకర రాశి
మకర రాశిలో తృతీయ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగంతో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలోనూ లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కలుగుతాయి.

కుంభరాశి
కుంభరాశిలో ధనస్థానంలో బుధుడు రవి కలవడం వల్ల ఆదాయానికి సంబంధించిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలకు ఆస్కారం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలలో మంచి బెనిఫిట్ కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+