బృహస్పతి దయతో ఆగస్టు 20వరకు మూడు రాశులవారిపై సంపద వర్షం!!
గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 13వ తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించాడు. బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 20వ తేదీ వరకు రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరించనున్నాడు.
12 సంవత్సరాల తర్వాత రోహిణీ నక్షత్రంలో బృహస్పతి
సుమారు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి రోహిణి నక్షత్రంలో సంచరించడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం 66 రోజులు మూడు రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. శుక్రుడు అధిపతి అయిన రోహిణి నక్షత్రం లోనూ, వృషభ రాశిలోనూ బృహస్పతి సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశి లోనే ఉన్న కారణంగా వృషభ రాశి జాతకులకు మేలు జరుగుతుంది. ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తలు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు బృహస్పతి సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరించడం వల్ల సింహరాశి జాతకులకు వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరించడానికి ఇదే సరైన సమయం.
ధనుస్సు రాశి
బృహస్పతి సంచారం ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు, వారి వలన మీకు భవిష్యత్తులో ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications