శని దయతో మహా శివరాత్రి నుండి వీరికి శనిదోషం నుండి విముక్తి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో మహాశివరాత్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే మహాశివరాత్రి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది. ఈ మహాశివరాత్రి పర్వదినాన జరుగుతున్న గ్రహాల సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.
మహాశివరాత్రి నుంచి శని దోషం పూర్తిగా తొలగిపోయే రాశులు
మహాశివరాత్రి రోజు ఉచ్చ శుక్రుడు, మీనరాశిలో సంచరించే బుధుడు, వృషభ రాశిలో సంచరించే గురువు, కుంభరాశిలో సంచరించే రవి, శని కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో సత్ఫలితాలు వస్తాయి. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో శని దోషాలు తొలగిపోతాయి.శని దయ కారణంగా మహాశివరాత్రి నుంచి శని దోషం పూర్తిగా తొలగిపోయే రాశులు ఏమిటి అనేది తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి గత రెండు సంవత్సరాలుగా అష్టమశని దోషం ఏర్పడింది. మార్చి 29వ తేదీతో ఈ శనిదోషం పూర్తిగా తొలగిపోతుంది. మహాశివరాత్రి రోజున శివారాధన చేయడంతో లేదా రుద్రాష్టకం పఠించటంతో ఈ దోషం పోతుంది. కర్కాటకరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుంది. కర్కాటకరాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కష్టాలు తొలగిపోయి కర్కాటక రాశి వారి సంతోషంగా ఉంటారు.
సింహరాశి
సింహ రాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండడం కారణంగా మీరు పెళ్లి సంబంధాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే సింహరాశి వారికి శివరాత్రి నాడు శివుడి పూజ చేయడం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి వస్తుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి శని దోషం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే మహాశివరాత్రి రోజు వృశ్చిక రాశి వారు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కుటుంబంలో సుఖం పెరుగుతుంది. వీరి సొంతింటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై కార్యసిద్ధి జరుగుతుంది. చేపట్టే ప్రతి పని విజయాలను ఇస్తుంది.
మకర రాశి
ఈ రాశి వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా అనేక ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజు మీరు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆరోగ్యం వీరికి మెరుగుపడుతుంది. శని దోషం పూర్తిగా పోయి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి.
కుంభరాశి
ఈ రాశి వారికి గత ఐదేళ్లుగా కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మహాశివరాత్రి రోజున శివ పూజ చేయడం వల్ల ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గి వీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. కుంభ రాశి వారికి ఆదాయం పెరగడమే కాకుండా వీరి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
మీనరాశి
ఈ రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులను శని కలిగిస్తున్నాడు. అయితే మీన రాశి వారికి మహాశివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుడికి పూజ చేసి, రుద్రాష్టకాన్ని జపిస్తే ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వీరు వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.












Click it and Unblock the Notifications