ధన త్రయోదశి నాడు బంగారం కొనలేరా? ఈ పనులు చెయ్యండి చాలు.. లక్ష్మీ కటాక్షం!

ధన త్రయోదశి అనేది దీపావళికి ముందు జరిగే ప్రత్యేక పండుగ. ఇది హిందువులకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజున, ప్రజలు ధన్వంతరిని, కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ధన త్రయోదశి పర్వదినం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. దీపావళికి సిద్ధం కావడానికి ముందు హిందువులంతా జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు లాంటిది.

బంగారం ధరలతో ధన త్రయోదశిపై నిరాశ
కానీ ఇప్పుడు, బంగారం ధర విపరీతంగా పెరిగింది. సాధారణ కుటుంబాలు దానిని కొనుగోలు చేయడం కష్టంగా మారింది . చాలా మంది మహిళలు ప్రతీ సంవత్సరం ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తారు. కానీ ఈ సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్న బంగారం ధరలతో బంగారం వంక కూడా చూసే పరిస్థితి లేదు.

Can t buy gold on Dhana Trayodashi Just do these things for lakshmi blessings

బంగారం కొనలేకున్నా నో ప్రాబ్లమ్.. ఇలా చెయ్యండి
అయితే ఈ సారి ధన త్రయోదశి నాడు బంగారాన్ని కొనలేక పోతున్నామని ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. బంగారాన్ని కొనే బదులు ఇతరులకు సహాయం చేయడానికి కొన్ని వస్తువులను దానం చేస్తే బంగారం కొన్నంత పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. ధన త్రయోదశి నాడు పాలు, పెరుగు, తేనె, వెన్న వంటి వాటిని దానం చేస్తే శుభం కలుగుతుంది.

ఇవి దానం చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం
అలాగే, మీరు తెల్లని బట్టలు, బూట్లు మరియు గొడుగు వంటి వాటిని విరాళంగా ఇస్తే, మీరు ప్రతిఫలంగా లక్ష్మీ కటాక్షం పొందుతారని చెప్తున్నారు. భార్యాభర్తలు కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే, ఈ ప్రత్యేకమైన రోజున ఎవరికైనా ఒక పరుపు లేదా మంచం ఇవ్వడం మంచిది. మీరు బంగారం, బట్టలు, పరుపులు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను ఇస్తే, అది జంటలను కలిసి ఉండేలా చేస్తుంది.

ఈ పని చేస్తే సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి
మీ జీవితంలో చాలా శుభాలను తీసుకురావడానికి సహాయపడుతుందని కూడా చెప్తారు. మీరు దానం చేసినప్పుడు, లక్ష్మీ దేవి సంతోషంగా ఉంటుందని ఆమె తన దయతో మీకు సంపదను అనుగ్రహిస్తుందని అంటున్నారు. ధన త్రయోదశి అని పిలువబడే ప్రత్యేక రోజున, మీరు ఏదైనా దాన ధర్మాలతో మంచిని చేస్తే , మీరు గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+