చైత్రమాసం 2024: ఈ మాసమంతా ఈ పనులు అస్సలే చెయ్యొద్దు!!
తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం చైత్ర మాసం ఉగాదితో మొదలవుతుంది.ఉత్తర భారత దేశ సూర్యమాన క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం ముగిసి నేటి నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్లో చైత్రమాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది వసంత రుతువులో వచ్చే తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసం అనగానే మనకు ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు గుర్తొస్తాయి. ఈ సంవత్సరం చైత్రమాసం మార్చి 26 నేటి నుండి మొదలై, ఏప్రిల్ 23వ తేదీన ముగుస్తుంది.
చైత్రమాస్తాన్ని విష్ణువుకి అంకితం చేసిన మాసంగా చెబుతారు. ఈ మాసంలో ఎవరైతే విష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వస్తాయని, సంపదలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హిందువులు చైత్రమాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. చైత్రమాసంలో జరిగే నవరాత్రులను చైత్ర నవరాత్రులని, వసంత నవరాత్రులని కూడా అంటారు.

అయితే చైత్రమాసంలో విష్ణువు కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ నెల అంతా నియమ నిష్టలను పాటించాలి. చైత్రమాసంలో పాటించవలసిన నియమనిష్టల విషయానికి వస్తే చైత్రమాసంలో మాంసాహారానికి, మసాలాలతో కూడిన తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. చైత్రమాసంలో మాంసాహారం తింటే లక్ష్మీదేవికి అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చైత్రమాసంలో బెల్లం తినడం మానుకోవాలి. చైత్రమాసంలో జరిగే వివిధ వేడుకల సమయాలలో బెల్లం తినడం మానుకోవాలని సూచన. అంతేకాదు చైత్రమాసం అంతా వెల్లిపాయలను, ఉల్లిపాయలను తినడం మానేయాలని చెబుతున్నారు. చైత్రమాసంలో దుర్గాదేవిని పూజించేవారు తప్పనిసరిగా వెల్లిపాయలను, ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి.
చైత్రమాసంలో తోలు తో తయారుచేసిన వస్తువులను ఉపయోగించడం మంచిది కాదు. లెదర్ జంతువుల చర్మంతో తయారు చేయబడుతుంది కాబట్టి చైత్రమాసంలో వీటిని అసలే ఉపయోగించకూడదు. లెదర్ తో తయారు చేసిన వస్తువులను ఈ మాసంలో ఉపయోగిస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చైత్రమాసం అన్ని రోజులూ గోర్లు, జుట్టు కత్తిరించుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ కత్తిరించుకుంటే మీ ఆరోగ్యం మరింత దిగజారుతుందని చెబుతారు.
చైత్రమాసంలో ఎవరు వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ముఖ్యంగా మహిళలు వివాదాలలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తల దూరిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.ఫలితంగా ఆర్ధిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications