chandra grahan 2023: గ్రహణం తర్వాత నాలుగు వస్తువులు దానంచేస్తే సంపద,శ్రేయస్సు!!
ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో రేపు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్ర గ్రహణంగా చెబుతున్నారు. సహజంగా గ్రహణాలు ఏవైనా అవి ప్రతికూలతలను కలిగిస్తాయని, గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రహణాల సమయంలో మనం చేసే కొన్ని పనుల వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుందని కూడా చెబుతున్నారు.
అటువంటి పనులలో దానం చేయడం ఒకటని, చంద్రగ్రహణం రోజు నాలుగు వస్తువులను దానం చేస్తే అనేక సమస్యల నుండి పరిష్కారం లభించి తల్లి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు.రేపు చంద్రగ్రహణం తర్వాత కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల గ్రహణ సమయంలో ఏర్పడే దుష్ఫలితాలు తొలగిపోవడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

చంద్రగ్రహణం తర్వాత తెల్లని వస్తువులను దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల డబ్బు, గౌరవం పెరుగుతాయని చెబుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అనేక తీవ్రమైన సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. తెల్లటి బట్టలను, వస్తువులను దానం చేయడం వల్ల కీర్తి, శక్తితో పాటుగా మానసిక బలాన్ని కూడా మీరు పొందుతారు.
చంద్రగ్రహణం తర్వాత పాలను దానం చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీకు సంపదను ఇస్తుంది. చంద్రుడితో పాలు సంబంధం కలిగి ఉండడం వల్ల చంద్రగ్రహణం తర్వాత పాలను దానం చేయడం మంచిదని, దీనివల్ల జాతకంలో చంద్రుడు బలపడతారని చెబుతున్నారు. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని అంటున్నారు.
అన్నం కూడా చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుందని చంద్రగ్రహణం తర్వాత బియ్యాన్ని దానం చేసిన, అన్నదానం చేసిన అది సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. చంద్రగ్రహణం తర్వాత వెండి వస్తువులను దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వెండిని దానం చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. చంద్రగ్రహణం తర్వాత పంచదారని నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవతలు ప్రసన్నులు అవుతారు. ఇది ఎప్పుడు సంపదను, శ్రేయస్సును కలిగిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications