మార్చి 3న చంద్ర గ్రహణంతో లాభపడే రాశులు వీరే
2026 సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతోంది. ఇది మనదేశంలో పాక్షిక ప్రభావమే చూపుతోంది. ఆ రోజు సాయంత్రం 6:15 నుండి 6:45 గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది. గ్రహణం సింహ రాశిలోని పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుండటంతో, ఈ రాశికి చెందిన వారు, ఆ నక్షత్రం గల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.
అదృష్ట రాశులు
ఈ గ్రహణం అందరికీ ఇబ్బంది కాదు. కొన్ని రాశుల వారికి ఇది అదృష్టాన్ని మోసుకొస్తోంది. ముఖ్యంగా మిథున, తులా, వృశ్చిక, మీన రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మిధున రాశి వారు పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. తులా రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీన రాశి వారు ప్రత్యర్థులపై విజయం సాధించి, సమాజంలో మంచిపేరు గడిస్తారు.

జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు
గ్రహణ దోషం ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సింహ రాశి వారు తమ పేరు ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి గర్భిణీలు, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. కర్కాటకం, కన్య, ధనస్సు, కుంభ రాశుల వారు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు , కీలక నిర్ణయాల్లో ఆవేశపడకూడదు. రాబోయే 40 రోజులు వీరు జాగ్రత్తగా ఉంటే చాలు. వృషభ, మకర రాశుల వారికి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.
దోష నివారణ
గ్రహణ దోషం ఉన్నవారు పరిహారాలతో ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత రోజు బియ్యం, గోధుమలు, ఉలవలు, మినుములు, నువ్వులను ఆవు నెయ్యితో కలిపి ఇత్తడి గిన్నెలో ఉంచి దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. గ్రహణ సమయంలో మౌనంగా ఉంటూ ఇష్టదైవ మంత్రాన్ని జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు "ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధినీ నమః" అనే మంత్రాన్ని పఠించడం వల్ల శుభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications