త్వరలో చంద్ర మంగళ యోగంతో ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారమే!
ఈనెల 30వ తేదీన, డిసెంబర్ 1,2 తేదీలలో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. కుజుడు అధిపతి అయిన వృశ్చిక రాశిలోకి చంద్రుడు, చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశిలోకి కుజుడు సంచరించడం కారణంగా ఈ పరివర్తన యోగం ఏర్పడుతుంది.
చంద్ర మంగళ యోగం
అయితే కుజుడు చంద్రుడి మధ్య రాశి పరివర్తన జరిగేది మూడు రోజులే అయినప్పటికీ దీని ఫలితం మాత్రం దాదాపు 15 రోజులపాటు కొనసాగుతుంది.ఈ పరివర్తనయోగం చంద్రమంగళ యోగం అనే ధన యోగాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది అ ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
చంద్ర మంగళ యోగం కారణంగా కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి పంచమాధిపతి కుజుడితో పరివర్తన జరిగినందువల్ల వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో వీరి రాబడి బాగా పెరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది.
కన్యారాశి
చంద్రమంగళ యోగం ప్రభావంతో కన్యారాశి జాతకులకు ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా లాభదాయకంగా ఉంటుంది. దీంతో వృత్తి వ్యాపారాలలో వీరికి లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఇది అన్ని విధాలుగా కన్యా రాశి వారికి అదృష్ట సమయం.
తులారాశి
తులా రాశి వారికి చంద్రమంగళ యోగం కారణంగా సంపద వృద్ధి జరుగుతుంది. కెరీర్ లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు ఊహించని విధంగా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ సమయంలో తులా రాశి వారి డిమాండ్ బాగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి
చంద్రమంగళ యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. తండ్రికి సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి. చాలాకాలంగా పరిష్కారం కానీ ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబంలో సంతోషం చోటు చేసుకుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మకర రాశి
చంద్రమంగళ యోగం కారణంగా మకర రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మీనరాశి
చంద్రమంగళ యోగం కారణంగా మీనరాశి జాతకులు ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పురోగతినిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు, పెళ్లి ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications