19 ఏళ్ళ తర్వాత.. ఈ చాతుర్మాసం చాలా ప్రత్యేకం: పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!!
నేటి నుండి హిందువులు పరమపవిత్రంగా భావించే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే పరమ పవిత్రమైన మాసం చాతుర్మాసం. హిందువులు దీనిని చాలా విశేషంగా భావించి చాతుర్మాస కాలమంతా నిష్టగా పూజలు చేస్తారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చాతుర్మాసం నేడు దేవ శయని ఏకాదశి రోజున మొదలై కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ముగుస్తుంది.
మొత్తం నాలుగు నెలల కాలం చాతుర్మాసం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం రావటం వల్ల చాతుర్మాస కాలం 5 నెలల పాటు కొనసాగుతుంది. 19ఏళ్ళ తర్వాత అధికా శ్రావణ మాసం రావటంతో ఈ చాతుర్మాసం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ ఐదు నెలల చాతుర్మాసంలో వేడుకలు, శుభకార్యాలు చెయ్యటం మానుకోవాలని సూచించబడింది. ఈ సంవత్సరం చాతుర్మాసం ఎంతో విశిష్టత కలిగి ఉంది.

ఇక చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి చాతుర్మాసం లో పాటించవలసిన నియమాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాతుర్మాసంలో నియమాలను సక్రమంగా పాటించిన వారికి భగవంతుని కృప ఉంటుంది. చాతుర్మాసంలో ఉపవాసాలను పాటించవలసిన అవసరం ఉంది. నేలపైనే నిద్రించాలి అని సూచించబడింది. అయితే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉండి నేలపైన పడుకో లేకపోతే రిస్కు తీసుకోవద్దు అని చెబుతున్నారు.
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అని, తలస్నానం చేయాలని సాధ్యమైనంత వరకూ మనసుని దేవుడిపై లగ్నం చేసి భక్తి భావంతో పూజలు చేయాలని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు చాతుర్మాస కాలమంతా నిశ్శబ్దంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదని చెప్తున్నారు. రోజుకు ఒక పూట భోజనం చేసి, రాత్రి వేళల్లో ఏవైనా పండ్లు తినవచ్చునని చెబుతున్నారు.
చాతుర్మాస కాలమంతా పరమనిష్టతో బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని, ప్రతిరోజూ తప్పనిసరిగా సూర్య నమస్కారం చేయాలని ,సూర్యుడిని ప్రత్యేకంగా పూజించాలని చెబుతున్నారు. చాతుర్మాసంలో ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా శ్రీమహావిష్ణువుని, శివుడిని పూజించాలని చెబుతున్నారు. దానధర్మాలు చెయ్యాలని, మీ సామర్ధ్యాన్ని అనుసరించి ఆహారం, దుస్తులు తదితరాలు దానం చేయాలని, ఎవరికైనా ఆశ్రయం కల్పించినా మంచిదేనని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications