నేడే దశాంశ యోగం.. వీరికి పట్టిందల్లా బంగారం అంటున్న శని సూర్యులు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో దేనికవే ప్రత్యేకమైనవి. గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలు వివిధ రాశులలో ఇతర గ్రహాలతో సంయోగం జరిపి కొన్ని రాశులవారికి శుభ, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తాయి. 2026 జులై 25 వ తేదీన సూర్య శని గ్రహాల మధ్య దశాంశ యోగం ఏర్పడుతుంది.
సూర్య శని గ్రహాల మధ్య 108డిగ్రీల కోణంలో దశాంశ యోగం
ఈ రెండు ముఖ్య గ్రహాల మధ్య 108డిగ్రీల కోణంలో దశాంశ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సూర్య శని గ్రహాల మధ్య ఏర్పడే దశాంశ యోగం ప్రభావం రెండు రోజుల పాటు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఊహించని శుభాలు కలుగుతాయి.

మేషరాశి
మేషరాశి వారికి ఈ దశాంశ యోగం కారణంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్ లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారుగణనీయమైన లాభాలను పొందుతారు. మేషరాశి వారి ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది,
సింహరాశి
సింహరాశి జాతకులకు దశాంశ యోగం కలిసి వస్తుంది. సూర్యుడు ఈ రాశికి ఆధిపతిగా ఉండటంతో ఈ రాశి వారికి దశాంశ యోగం కారణంగా సానుకూలత ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. శుభ వార్తలు వింటారు.
తులా రాశి
తులారాశి జాతకులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి సమయం అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చూస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సామాజికంగా తులారాశి వారికి గుర్తింపు ఉంటుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు శని ఆధిపత్యం కారణంగా శుభాలు చేకూరుతాయి. కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు రావటంతో పాటు ఆర్ధిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications