ఆషాఢ నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు ఇవే
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ప్రారంభమౌతాయి. ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ అంటే నేటి నుంచి ప్రారంభమౌతున్నాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.
సాధారణంగా సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి. చైత్ర, ఆశ్వీయుజ మాసాల్లో వచ్చే నవరాత్రులను అందరూ జరుపుకుంటారు, గుప్త నవరాత్రులను కొందరు మాత్రమే ఆచరిస్తారు. ఆషాఢ నవరాత్రులు, గాయత్రీ నవరాత్రులుగా జరుపుకొంటారు.

గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో ప్రారంభమయ్యే గుప్త నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలు- కాళీకా దేవి, తారా దేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్తా దేవి, త్రిపుర భైరవి, ధూమావతి మాత, బగళాముఖి మాత, మాతంగి, కమలా దేవిలను పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారికి రహస్య పూజలు చేస్తారు. దేవాలయాలలో అమ్మవారికి అలంకరణలు, హోమాలు, దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు.
"గుప్త" అంటే రహస్యంగా ఉంచడం. తాంత్రికులు, యోగులు, భక్తులు ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక సాధనలు చేస్తారు. గుప్త నవరాత్రి సమయంలో చేసే ఆరాధన వల్ల త్వరగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారని, అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను తొమ్మిది అవతారాల్లో కొలుస్తారు. ఈ అవతారాలు శక్తి, కరుణ, జ్ఞానం, రక్షణ వంటి విభిన్న అంశాలను సూచిస్తాయి.
గుప్త నవరాత్రులలో గ్రహాల శుభ యోగం
జ్యోతిష్యం తెలిపిన ప్రకారం నవరాత్రులలో శని, రాహు, కేతు గ్రహాల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా రాహు శాంతి కోసం ఏదైనా పారాయణం చేయించుకోవచ్చు. ఈ సమయంలో గ్రహాల అశుభ దశల కోసం చేసే హోమం, మంత్రాల పారాయణం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
ఈ గుప్త నవరాత్రులలో రుద్రాభిషేకం, దుర్గా సప్తశతి పారాయణం మరియు కాళీ సాధన వంటి ప్రత్యేక పరిహారాలు చేస్తారు. గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన పర్వదినం. ఈ సమయంలో అమ్మవారిని పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. గుప్త నవరాత్రుల సమయంలో చేసే ఈ పరిహారాలు, పూజలు వ్యక్తి జీవితంలోని సమస్యలను తొలగించి, సుఖ సంతోషాలను కలిగిస్తాయని నమ్ముతారు
గుప్త నవరాత్రి మతపరమైన ఆచారం కాదు.. స్త్రీ శక్తికి నిదర్శనంగా భావిస్తారు. అమ్మవారికి సంబంధించిన అత్యంత శక్తిమంతమైన రూపాలను పూజించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని నమ్ముతారు. ఉపవాసం ఉండటం, ధ్యానం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని, మనలోని అంతర్గత ఆధ్యాత్మికతను ఉత్తేజితం చేసుకోవచ్చు.
Disclaimer: గుప్త నవరాత్రుల ప్రాధాన్యత, విశిష్టతను పాఠకులకు తెలియజేయడమే దీనికి కథనం ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆచరించాలని భావిస్తే పండితులు, ఈ పూజా విధానం గురించి తెలిసిన వారిని తప్పకుండా సంప్రదించాలి.












Click it and Unblock the Notifications