ఫిబ్రవరిలో ధనలక్ష్మీ యోగంతో వీరికి డబ్బుల మూటలు.. రాసి పెట్టుకోండి!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్న గ్రహాలు ఒకదానితో ఒకటి సంయోగం చెందడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు కొన్ని శుభయోగాలు కాగా, మరికొన్ని అశుభయోగాలు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి మిధున రాశిలో కుజ చంద్రుల కలయిక కారణంగా ధనలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది.
ధనలక్ష్మీ యోగం
జనవరి 21వ తేదీన కుజుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తుండగా, ఫిబ్రవరి 8వ తేదీన చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు అక్కడ కలయిక జరగడంతో మిధున రాశిలో ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ ధనలక్ష్మి యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధునరాశిలో ఏర్పడే ధనలక్ష్మీ యోగం కారణంగా మిధునరాశి వారిపైన సానుకూల ప్రభావం పడుతుంది. . దీనివల్ల వీరి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నేటి నుంచి వీరి జీవితం సంపదలతో తులతూగుతూ సాగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి శ్రమకి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
ధనలక్ష్మీ యోగం కర్కాటక రాశి వారికి సంపదలను తెచ్చిపెడుతుంది. ధనలక్ష్మి యోగం ప్రభావంతో కర్కాటక జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు . కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆర్థికంగా వేగంగా పురోగతి సాధించడానికి వీలవుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదృష్ట లక్ష్మి ఈ సమయంలో వీరిని వరిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహ రాశి
సిం.హ రాశి వారికి ధనలక్ష్మీ యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకులు అన్ని రంగాలలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. 2025 సంవత్సరం లో సింహరాశి వారికి అన్నీ శుభ ఫలితాలే వస్తాయి. పోటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరు ఈ సమయంలో విజయం సాధిస్తారు. జీవితంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకొని భారీ లాభాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications