కర్కాటకరాశిలో బుధుడి ఉదయంతో వీరికి ధనలక్ష్మీ కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుధుడు కర్కాటకంలో ఉన్నప్పుడు సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపిస్తాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ఆగస్టు 26వ తేదీన ఉదయించాడు. కర్కాటక రాశిలో బుధుడు ఉదయం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.
మిధున రాశి
కర్కాటక రాశిలో బుధుడు ఉదయం కారణంగా మిధున రాశి జాతకులు డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. వీరి ఉద్యోగాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు. కొత్త వెంచర్ల లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశిలో బుధోదయం అన్ని విధాలుగా మిధున రాశి వారికి సంతృప్తినిస్తుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి కర్కాటక రాశిలో బుధుడు ఉదయం కారణంగా బాగా కలిసి వస్తుంది. కెరీర్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించని మద్దతు దొరుకుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది
మీనరాశి
మీన రాశి వారికి బుధుడు ఉదయం కారణంగా స్నేహితులు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో సహచరుల నుండి మరిన్ని లాభాలను మద్దతును పొందుతారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్పెక్యులేషన్లు లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యంగాను, మంచి ఆత్మవిశ్వాసంతోను ఉంటారు.
కన్యారాశి
కర్కాటక రాశిలో ఉధోదయం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీరు సంతోషంగా ఉంటారు .ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. అధిక డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తులారాశి
తులా రాశి వారికి కూడా కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం కారణంగా లబ్ధి జరుగుతుంది. తులారాశి వారికి విదేశాలలో నూతన అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి .జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications