వీరి ఇంటికి ధనలక్ష్మిని పంపించిన ట్రిపుల్ రాజయోగం!
సెప్టెంబర్ నెలలో గ్రహ సంచారాల కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులు సంభవించాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైన నెలగా పరిగణించబడింది. సెప్టెంబర్ నెలలో శని దేవుడు తన సొంత రాశిలో కుంభరాశిలో ఉన్నప్పుడు శేషా రాజయోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు తన సొంత రాశిలో సంచరిస్తున్న సమయంలో భద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు.
అంతకు ముందు సెప్టెంబర్ 18 వ తేదీన శుక్రుడు తన సొంత రాశి చక్రమైన తులారాశిలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఈ మూడు రాజయోగాలతో సెప్టెంబర్ మాసం అంతా కొన్ని రాశుల వారు అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సెప్టెంబర్ నెలలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాలు సృష్టిస్తున్న యోగాల కారణంగా మేష రాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారారు. మేష రాశి జాతకులకు వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
కన్యారాశి
సెప్టెంబర్ నెలలో ట్రిపుల్ రాజయోగాల కారణంగా కన్యరాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతున్నారు. కన్యారాశి వారి పైన ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కన్యా రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సింహరాశి
సెప్టెంబర్ మాసమంతా ట్రిపుల్ రాజ యోగం కారణంగా సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. ఈ సమయంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది.
తులారాశి
సెప్టెంబర్ మాసం తులారాశి జాతకులకు ట్రిపుల్ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. త్వరలోనే తులా రాశి జాతకులు మంచి విజయాలను సాధించబోతున్నారు. వీరి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ట్రిపుల్ రాజ యోగం కారణంగా సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.
మీనరాశి
సెప్టెంబర్ నెల మీన రాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది. ఇది మీన రాశి వారికి కలిసి వచ్చేనెల. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మీనరాశి జాతకులు నిలదొక్కుకుంటారు. వీరి జీవితంలో సానుకూల మార్పులను ఈ సమయంలో చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications