దిగ్బల రాజయోగంతో ప్రస్తుతం ఆకస్మిక ధనలాభం పొందుతున్న రాశులు!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి రాశిలో అయితే బుధుడు లేదా గురువు సంచరిస్తూ ఉండి ,చతుర్దంలో శుక్రుడు లేదా చంద్రుడు ఉంటే, సప్తమంలో శని, దశమంలో రవి లేదా కుజుడు సంచారం చేస్తున్నప్పుడు దిగ్బల రాజయోగం పడుతుంది. దిగ్బల రాజ యోగం కారణంగా ఆయా రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశిలో గురు సంచారం వల్ల వీరికి దిగ్భల యోగం పట్టింది. ఈ ఏడాదంతా వృషభ రాశి వారికి దిగ్బల యోగం కొనసాగుతుంది. దీనివల్ల వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొద్ది శ్రమతో అత్యధిక లాభాలను సంపాదిస్తారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే కాకుండా సామాజికంగాను ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి.

మిధున రాశి
ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల సెప్టెంబర్ 18 వరకు దిగ్బల రాజ యోగం కొనసాగుతుంది. దీని కారణంగా వీరి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహ వాహన యోగాలు, ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దాంపత్య జీవితం కూడా సవ్యంగా సాగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలో బుధ సంచారం వల్ల మరో 15 రోజులు వరకు దిగ్భల యోగం వీరికి కొనసాగుతుంది. దీనివల్ల వీరికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆస్తి కుటుంబ సమస్యలను చాలా సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తారు.
సింహరాశి
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. దీనివల్ల వీరికి దిగ్బల యోగం పట్టింది. ఫలితంగా వ్యాపారాలు వీరికి బాగా అభివృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా తప్పనిసరిగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసిన ఈ సమయంలో ఫలితం సానుకూలంగా వస్తుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి హోదా లభించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. విదేశీయానం చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల రాజయోగం ఏర్పడింది. దీనివల్ల వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తండ్రికి సంబంధించిన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసిన విజయం వరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications