Diwali 2023: దీపావళి ప్రాశస్త్యం, చరిత్ర.. లక్ష్మీపూజతో ఐశ్వర్యం!!
భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటాం. సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజ ప్రదోష కాలంలోనే నిర్వహిస్తారు. ఆ సమయంలో పూజ చేస్తేనే శుభాలు కలుగుతాయని పంచాంగం చెబుతోంది.
ఈ పండుగలో మరో విశేషం లక్ష్మీపూజ. హిందూ గ్రంధాల ప్రకారం, లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి ప్రతీక. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్మి దేవి పూజలు విశేషంగా చేస్తారు. ఈ పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి.హిందూ ఇతిహాసం రామాయణంలోని ఒక కథ దీపావళి పండుగకు సంబంధించి ప్రాచుర్యంలో ఉంది.

రాముడు 14 ఏళ్ళ వనవాసం ముగించుకుని రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్య వాసులు దీపాలు వెలిగించి రామయ్యకు స్వాగతం పలికారని చెప్తారు. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావడం శ్రేయస్సు , ఆనందాన్ని సూచిస్తుందని అందుకే ఆ రోజును దీపావళిగా అయోధ్య వాసులు జరుపుకోగా అప్పటినుండి ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.
దీపావళి పండుగకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని సత్యభామ సంహరిస్తుంది.నరకాసుర సంహారంతో ప్రజలు సంతోషంతో దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలను ఇబ్బందులు పెడుతూ అందరినీ వేధింపులకు గురి చేస్తుండేవాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో పుట్టిన నరకుడు తన చావు తల్లి చేతిలో పొందాలని వరం కోరుకుంటాడు.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి మహావిష్ణువు, సత్యభామను పెళ్లాడతాడు. భూదేవి అంశ అయిన సత్యభామ శ్రీకృష్ణుడు తో కలిసి నరకాసురుని అకృత్యాలను అరికట్టడానికి యుద్ధానికి వెళుతుంది. ఈ యుద్ధంలో సత్యభామ నరకాసురుని హతమారుస్తుంది. నరకాసురుని సత్యభామ సంహరించినందుకు,అందరూ సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి దీపావళి వేడుకను చేసుకుంటారు. ఇలా అప్పటి నుండి దీపావళి పండుగ కొనసాగుతుందని చెప్తారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications