Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులలో పొరబాటున కూడా ఈ పనులు చెయ్యొద్దు!!
చైత్రమాసం ప్రారంభమైంది. నిన్నటి నుండి తొమ్మిది రోజులపాటు చైత్ర నవరాత్రులు జరగనున్నాయి. ఈ చైత్ర నవరాత్రులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని ఎవరైతే విశేషంగా పూజిస్తారో వారు అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు. ఈ తొమ్మిది రాత్రులలో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని తొమ్మిది రూపాలలో, తొమ్మిది రోజులపాటు అత్యంత నియమనిష్టలతో పూజలు చేస్తారు.
చైత్ర నవరాత్రుల సందర్భంగా చేయకూడని పనులు
నవరాత్రుల మొదటి రోజున ప్రతి ఇంట్లో ఘట స్థాపన చేసి ఉపవాసాన్ని, పూజలను ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా చేయకూడని, నిషేధించబడిన కొన్ని పనులను గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు తప్పక ఈ నియమాలను పాటించాలి.

ఆహరం విషయంలో జాగ్రత్త
ఎవరైతే దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు వారు ఈ పనులు చేయకుండా ఉండాలి. నవరాత్రులలో సాల్ట్ రోజు వారి వినియోగానికి దూరంగా ఉండాలి. అవసరమైతే రాతి ఉప్పును మాత్రమే వాడాలి. నవరాత్రులలో మద్యం, మాంసం తీసుకోకూడదు. తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ధూమపానం చేయకూడదు.నవరాత్రుల సమయంలో నువ్వుల నూనెను, ఆవనూనెను తీసుకోకూడదు.
ఈ పనులు అసలే చేయొద్దు..
నవరాత్రుల దీక్షను ఆచరిస్తున్న వారు గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేయడం చేయకూడదు. నవరాత్రుల దీక్షను ఆచరించేవారు తోలుతో తయారు చేసిన బెల్టులను, హ్యాండ్ బ్యాగ్ లను , తోలుతో తయారు చేసిన వస్తువులను వినియోగించకూడదు. నవరాత్రులలో ఉపవాసం పాటించేవారు మంచం మీద పొరపాటున కూడా పడుకోకూడదు. వారు ఉపవాస దీక్షతో పాటు నేలపైన పడుకుని దీక్షను ఆచరించాలి.
మాట్లాడేటప్పుడు నియమాలు
అమ్మవారిని పూజించే రోజులలో వారు సౌఖ్యాన్ని త్యాగం చేయాలి. నవరాత్రుల సమయంలో స్త్రీలను అగౌరవ పరచకూడదు. అసభ్యంగా ఎవరినీ దూషించకూడదు. ఆహారాన్ని వృధా చేయకూడదు. ఆహారాన్ని వృధా చేయడం పాపంగా పరిగణించబడుతుంది. నవరాత్రుల సమయంలో చేసే వంటలలో ఉల్లి, వెల్లుల్లిని అసలు వాడకూడదు. ఈ నియమాలను పాటించి అత్యంత భక్తిశ్రద్ధలతో చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని పూజించాలని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications