కార్తీక మాసంలో ఈ పనులు చెయ్యండి.. పట్టిందల్లా బంగారమే!!
అన్ని మాసాలలోనూ కార్తీకమాసానికి ఉండే స్పెషాలిటీ అంతా ఇంతా కాదు. కార్తీక మాసంలో నిత్యం నిష్టతో శివకేశవులకు పూజలు చేస్తే సకల పాప హరణం జరుగుతుందని, పుణ్యగతులు ప్రాప్తిస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. కార్తీకమాసంలో కొన్ని పనులు చేయడంవల్ల జీవితంలో తిరుగే ఉండదని, వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
మరి ఎలాంటి పనులు చేస్తే కార్తీక మాసంలో శుభం జరుగుతుంది అంటే...కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానాన్ని ఆచరిస్తే శుభం జరుగుతుంది. కార్తీక స్నానాన్ని ఆచరించడం వల్ల మనో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క కటాక్షం కలుగుతుంది.

కార్తీకమాసంలో దీపారాధనతో పుణ్యఫలాలు కలుగుతాయి అని చెబుతారు. కార్తీకమాసం అన్ని రోజులు విశిష్టమైన రోజులు కాబట్టి, ఆయా రోజులకు తగ్గట్టుగా పూజలను చేయడం, శివుడికి, కేశవుడికి ఇష్టమైన కార్తీకమాసంలో వారిని ఆరాధించడం సత్ఫలితాలను ఇస్తుందని చెబుతారు. దీని వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు. కార్తీక దీపారాధనతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని, దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
కార్తీకమాస వ్రతాలు నిష్టగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని, కార్తీకమాసంలో సోమవార వ్రతాన్ని, కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని, లక్ష పత్రి పూజను, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల, వనభోజనాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు.
కార్తీక మాసంలో దానధర్మాలు చేస్తే మంచిదని, దాన ధర్మాలతో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. కార్తీక మాసంలో నువ్వులను దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని, వారి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. కార్తీకమాసంలో చేయవలసిన పనులను తెలుసుకొని తదనుగుణంగా నియమనిష్ఠలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుందని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications