బెడ్ రూమ్ వాస్తు ఎలా ఉంటే మీ జీవితం సుఖంగా ఉంటుందో తెలుసా?
వాస్తు శాస్త్రానికి జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు గృహ నిర్మాణమైనా, కార్యాలయం నిర్మాణమైనా, ఏది నిర్మాణం చేయాలన్నా సరే వాస్తును సరి చూసుకుంటారు. వాస్తుకు, మానవ జీవనానికి అవినాభావ సంబంధం ఉన్న కారణంగానే వాస్తును అందరూ అనుసరిస్తారు.
బెడ్ రూమ్ వాస్తు
వాస్తు ప్రకారం చేసిన నిర్మాణమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అనేది చాలా మంది బలంగా నమ్ముతారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో ఈరోజు మనం బెడ్ రూమ్ వాస్తు గురించి తెలుసుకుందాం. బెడ్ రూమ్ వాస్తు చక్కగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ మనిషి జీవితంలో సుఖంగా ఉంటాడు. ప్రస్తుతం బెడ్ రూమ్ వాస్తుకు సంబందించిన ప్రాధమిక నియమాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బెడ్ రూమ్ వాస్తు ఇలా ఉంటేనే బెస్ట్
ఎప్పుడైనా బెడ్ రూమ్ వాస్తు బాగుండాలి, ఇంట్లో బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉంటే మంచిది. బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉంటే ఇది స్థిరత్వాన్ని, బలాన్ని సూచిస్తుంది. బెడ్ రూమ్లో బెడ్ తల దక్షిణం వైపు లేదా తూర్పు వైపు ఉంటే మంచిది. బెడ్రూంలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా నిర్మాణం ఉండాలి. గదినిండా వస్తువులను పెట్టి చిందరవందరగా ఉంచితే ఆ ఇంట్లోని వాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు.
బెడ్ రూమ్ వాస్తు కోసం ఇవి చెయ్యండి
వాస్తు ప్రకారం బెడ్ రూమ్ ను ఎప్పుడు నీట్ గా సర్ది పెట్టుకోవాలి. శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. గదిలో సానుకూలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించే వస్తువులను పెట్టుకోవాలి. ప్రకృతి దృశ్యాలను, ప్రశాంతమైన చిత్రాలను బెడ్రూంలో పెట్టుకుంటే మంచిది. బెడ్ రూమ్ కి సంబంధించి వేసే రంగులు కూడా ప్రశాంతమైన రంగులు ఉండేలా చూసుకోవాలి.
ఇలా బెడ్ రూమ్ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి సంతోషం
లేత నీలం రంగు, లేత గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగు ఇలా ప్రశాంతమైన రంగులు ఉండేలా బెడ్రూంలో చూసుకోవాలి. ఇక బెడ్ రూమ్ తెరిచేటప్పుడు, పెట్టేటప్పుడు సౌండ్ రాకుండా చూసుకోవాలి. బెడ్ రూమ్ కి సంబంధించిన వాస్తు నియమాలు పాటించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఆ ఇంట్లో సానుకూలత వ్యాపించడానికి ఛాన్స్ ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications