4వ తేదీన ఆది అమావాస్య.. ఈ చిన్న పని చేయండి చాలు
ఆగస్టు ఐదోతేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. దానికి ముందురోజు అమావాస్య వస్తోంది. ఆరోజు పితృదేవతలను పూజించం మన సాంప్రదాయంగా వస్తోంది. వారిని అమావాస్య రోజు పూజిస్తే కష్టాల నుంచి విముక్తులవడమే కాకుండా వారికి కూడా ఉత్తమ గతులు కల్పించినవారిమవుతాం. ఆగస్టు నెలలో ఎంతో కీలకమైన ఆది అమావాస్య నాలుగోతేదీనే వస్తోంది. ఆరోజు సూర్యభగవానుడు సంచారం చేయడంవల్ల దక్షిణాయన పుణ్యకాం వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
యోగనిద్రలో మహా విష్ణువు
ఆది అమావాస్య రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహా శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తారు. నదీస్నానాలతోపాటు ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పిండ ప్రదానాలు పెడతారు. వీటితోపాటు గంగాదేవిని పూజిస్తారు. అదేరోజు పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడంవల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం.

ఆత్మలు శాంతిస్తాయి
ఆది అమావాస్య రోజు ప్రత్యేకమైన తిథిని నిర్వహించడంవల్ల ఆత్మలు శాంతిస్తాయి. అలాగే చాలామంది అన్నదానం చేస్తారు. ఆరోజు మనం చేసే పనులు ప్రతికూల కర్మలను, ఆధ్యాత్మిక మలినాలను శుభ్రపరుస్తాయి. పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి. నదులు, సముద్రాల్లో స్నానం చేయడంవల్ల ఆత్మ శుద్ధి అవుతుంది. తద్వారా పాపాలు తొలగిపోతాయి. నైవేద్యాల్లో బియ్యం, నువ్వులను, ఇతర పదార్థాలను వాడొచ్చు. ఆది అమావాస్య రోజు తర్పణంతోపాటు పితృ పూజలు చేయడంవల్ల మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ వారినుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications