శుక్రవారం నాడు ఈ పనులు అస్సలే చెయ్యొద్దు.. దరిద్రం!!

అన్ని వారాలలోనూ శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు లక్ష్మీదేవి కోసమే ప్రతీ ఒక్కరూ కేటాయిస్తారు. ముఖ్యంగా మహిళలు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవటం కోసం పూజలు చేస్తారు. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకునేవారు ఈ పనులు శుక్రవారం అస్సలే చెయ్యొద్దు.

శుక్రవారం నాడు డబ్బులు ఎవరికీ ఇవ్వకుండా ఉండాలి. శుక్రవారం అనవసరపు ఖర్చులు పెట్టకూడదు. శుక్రవారం నాడు వెలుగుతున్న దీపాన్ని ఆర్పకూడదు. శుక్రవారం నాడు తినే ఆహారాన్ని తినకుండా పక్కకు నెట్టొద్దు. తోడబుట్టిన వారి మనసులను కష్టపెట్టకూడదు. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో నిద్ర పోకూడదు. మహిళలు ఇళ్లలో బూజు దులపరాదు.

Dont do these things on Friday.. that will gives poverty!!

పాత సామాన్లను, పాత బట్టలను శుక్రవారం నాడు ఎవరికీ దానమివ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో సంపద వెళ్ళిపోతుందని చెప్తారు. శుక్రవారం నాడు పొరబాటున కూడా పసుపు, కుంకుమలను కింద పడేయకూడదు. అంతేకాదు శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. శుక్రవారం నాడు పువ్వులు క్రింద పడెయ్యకూడదు.

శుక్రవారం నాడు ఎవరినీ కఠినంగా తిట్టకూడదు. మందిరాలలో ఎండిపోయిన పువ్వులను కానీ, ఇంటి గుమ్మాలకు, దర్వాజా లకు పెట్టిన పువ్వులను కానీ శుక్రవారం నాడు తీసిపారేయకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే ఈ పనులు చేస్తే జీవితంలో విపరీతమైన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. కుటుంబ సభ్యులను గానీ, ఎవరిని గానీ తిట్టకూడదు . శుక్రవారం నాడు ఇంట్లోని ముఖ్యమైన ఆహార పదార్థమైన బియ్యాన్ని ఖాళీ చెయ్యకూడదు. ఉప్పు, పసుపు ఎవరికీ అరువు ఇవ్వకూడదు. శుక్రవారంనాడు మహిళలు అబద్ధాలు చెప్పకూడదు.

ఈ విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే , శుక్రవారం చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. అలా కాకుండా పైన పేర్కొన్న తప్పులు చేస్తే సంపద రాకపోగా, లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+