శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడి కటాక్షం కావాలంటే ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!
ఆగస్టు 26వ తేదీన కృష్ణాష్టమి కృష్ణాష్టమి వచ్చిందంటే చాలు ఇంట్లో కృష్ణుడికి పూజలు చేయడం చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి సంతోషపడటం చేస్తూ ఉంటాం. అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజించే వాళ్ళు కొన్ని నియమాలు తప్పక తెలుసుకోవాలి. కృష్ణాష్టమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
కృష్ణాష్టమి నాడు చెయ్యకూడని పనులు
కృష్ణాష్టమి నాడు పరమ పవిత్రమైన తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించాలి. శ్రీ మహా విష్ణువుకి ఇష్టమైన తులసిని పూజించాలి తప్ప ఎవరూ కూడా తులసి ఆకులను తుంచకూడదు. ఒకవేళ అలా చేస్తే వారి ఇంట అశుభం జరుగుతుంది. కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఇష్టమైన గోవులను పూజించాలి. శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ప్రేమ. అటువంటి గోవులను ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది.

కృష్ణాష్టమి నాడు ఇవి చేస్తే ఇబ్బంది
శ్రీ కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజించేవారు మాంసాహారం తినకూడదు. కృష్ణాష్టమి పర్వదినాన వెల్లుల్లి, ఉల్లి ని కూడా తినకూడదు. చేపలు, మాంసం, మద్యం కృష్ణాష్టమి నాడు పొరపాటున కూడా ఇంటికి తీసుకు రాకూడదు. శ్రీ కృష్ణాష్టమి రోజు పేదవాళ్లను అవమానించకూడదు. ఎవరితోనైనా ఆప్యాయంగా మెలగాలి. శ్రీకృష్ణుడి జన్మదినాన చేతనైతే పేదవాళ్లకు అన్నదానం చేయడం వంటివి చేయడం మంచిది. అంతేకానీ పొరపాటున కూడా ఎవరిని ఈసడించుకోకూడదు.
కృష్ణాష్టమి వ్రతం విషయంలో జాగ్రత్త
శ్రీ కృష్ణాష్టమి నాడు శ్రీ కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు అర్ధరాత్రి 12 గంటల లోపు వ్రతాన్ని విరమించకూడదు. ఉదయం నుంచి కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ రాత్రి 12 కాకముందే వ్రత భంగం జరిగితే ఉదయం నుంచి చేసిన వ్రత ఫలం ఉండదు. శ్రీ కృష్ణాష్టమి వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
కృష్ణాష్టమి నాడు ఇలా చేస్తే కృష్ణుడి అనుగ్రహం
ఇక కృష్ణాష్టమి నాడు చెట్లను నరకడం అశుభమని చెబుతారు. శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. కృష్ణుడు ప్రతిదానిలోనూ ఉంటాడని కృష్ణ భక్తులు నమ్ముతారు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు పొరపాటున కూడా మానవాళి మనుగడకు ఆధార భూతం అవుతున్న చెట్లను కొట్టకూడదు. వీలైతే మొక్కలను నాటాలి. ఇది కృష్ణుడి అనుగ్రహానికి కారణం అవుతుంది.
-
మే 29న లక్ష్మీ నారాయణ రాజయోగం ఇస్తుంది వీరికి ధనలక్ష్మీ కటాక్షం! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
నేడు బుధ సూర్యులు కలిసి వీరికి డబ్బుల మూటలు తెస్తున్నారు! -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే..












Click it and Unblock the Notifications