వంటింట్లో పొరబాటున కూడా ఇవి పెట్టొద్దు.. ఒకవేళ పెడితే నాశనమే!

వాస్తు.. ప్రతి ఇంటికి వాస్తు ఎంతో అవసరం. ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. వాస్తు ప్రకారం వాస్తు నియమాలకు అనుసారం ఇంట్లో ఉన్న ప్రతి గదిని నిర్మించుకుంటాం. అలా వాస్తుప్రకారం చేసే గృహనిర్మాణంలో వంటగది నిర్మాణం ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని నిర్మాణం చేసుకోవడం మాత్రమే కాదు వంటగదిలో పెట్టే వస్తువుల విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.

వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో పెట్టకుండా ఉంటేనే మంచిది. వంట గదిలో సానుకూల శక్తిని ప్రసరింపజేయడం కోసం నెగెటివిటీని వ్యాపింపజేసే వస్తువులను పెట్టకుండా ఉండాలి. మరి ఆ వస్తువులు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వాస్తు ప్రకారం వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో మురికి లేకుండా చూసుకోవాలి. వంటగది అశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు.

Don t put these things in the kitchen even by mistake If you do it will be a disaster

వంటగదిలో ఇవి ఉంటే ప్రతికూలతలు
సహజంగా వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో నిర్మించుకోవడం మేలు చేస్తుంది. వంట గదిలో సానుకూల శక్తి ప్రవహించాలంటే వంటగదిలో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పాడైపోయిన వస్తువులు వంట గదిలో ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా వంటగదిలో పాడైపోయిన ఆహారాలు, పాడైపోయిన పచ్చళ్లను వెంటనే బయట పడేయాలి. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి ఇంట్లో సానుకూలతను దెబ్బతీస్తాయి.

వంటగదిలో ఇవి పడితే అనారోగ్యం
వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిపోయిన గిన్నెలను, పగిలిపోయిన ప్లేట్లు, గ్లాసులు వంటి వాటిని ఉంచకూడదు. ఇవి మన ఆరోగ్యం పైన, సంపద పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించి మనకు నష్టం చేస్తాయి. చాలామంది వంటగదిలో మందులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. వంటగదిలో మందులు పెడితే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనారోగ్యాల బారిన పడుతూనే ఉంటారు.

ఇవి కిచెన్ లో పెడుతున్నారా? అయితే మీకసలే మంచి జరగదు
చెత్త డబ్బాలు, మురికి వంటింట్లో ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు వంటగదిలో పెట్టడం మంచిది కాదు. ఇక పాడైపోయిన వస్తువులు, ఉపయోగించని వస్తువులను ఉంచుకోవడం మంచిది కాదు.దేవుని విగ్రహాలు, దేవుని ఫోటోలు వంటగదిలో పెట్టడం మంచిది కాదు. ముళ్ళ కుండీలు, ఎండిపోయిన మొక్కలు వంటగదిలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షించి ఇంట్లోని వాళ్ళకి మంచి జరగదు.

వంటగది సానుకూలత కోసం వాస్తు
చాలామంది అనవసరమైన, ఉపయోగించని వస్తువులను, గడువు తీరిపోయిన వస్తువులను వంటగదిలో ఉంచుతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. వీటిని వంట గదిలో ఉంచడం వల్ల ఇవి నెగిటివిటీని ఆకర్షించి మీకు నష్టం చేస్తాయి.కనుక పైన పేర్కొన్న వాటిని కిచెన్ లో పెట్టకండి. వంటగది సానుకూలత కోసం వాస్తు పాటించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+