హోలీ తర్వాత డబుల్ గజకేసరి యోగం: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీన హోలీ పండుగను జరుపుకుంటున్నాం. ఇక ఈసారి హోలీ పండుగ చంద్రగ్రహణంతో కూడి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది .హోలీ పండుగ నాడు కూడా మూడు శుభయోగాలు అనేక రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తున్నాయి అంతేకాదు హోలీ పండుగ తర్వాత ఏర్పడే డబుల్ గజకేసరి యోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షాన్ని తీసుకువస్తుంది. వారి సంపదను వృద్ధి చేస్తుంది.
వేద జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గజకేసరి యోగం జాతకంలో ఏర్పడితే జీవితం గొప్పగా ఉంటుందని, ఏనుగు అంతటి సంపద లభిస్తుందని చెబుతారు. అయితే ఈసారి హోలీ పండుగ తర్వాత మార్చి 27వ తేదీన బృహస్పతి, బుధుడు, చంద్రుడి కలయిక వల్ల డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

వృషభ రాశి
డబుల్ గజకేసరి యోగం వృషభరాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృషభరాశి వారు పెట్టే పెట్టుబడులతో ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు వృషభరాశి వారి ప్రేమజీవితం ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. వృషభరాశి జాతకులు ఈ సమయంలో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు ఈ రాశి వారికి 12 ఇంట్లో సంచరించడం వల్ల ఈ సమయంలో వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది .ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది.
తులారాశి
తులారాశి లోనే చంద్రుడు బృహస్పతి, బుధుడు కలయిక జరుగుతున్న కారణంగా డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా తులా రాశి జాతకులకు ఊహించని ధనలాభం జరుగుతుంది. దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఉన్నత చదువులు చదివేవారికి ఈ సమయం అనుకూలం. వివాహం చేసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించబడతాయి.

మకర రాశి
మకర రాశి జాతకులకు డబుల్ గజకేసరి యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఊహించని ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలం. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications