జులైలో డబుల్ లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులవారికి డబుల్ ఐశ్వర్యం

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల కలయికల వల్ల యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభయోగాలు. చాలాసార్లు ఒకే రాశిలో గ్రహాల సంచారం అరుదైన కలయికలకు శుభ యోగాలకు దారితీస్తుంది. రాశులలో గ్రహాల కలయిక కారణంగా 12 రాశుల వారి జీవితం మీద శుభ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం జూలై నెలలో లక్ష్మీనారాయణ యోగం రెండుసార్లు ఏర్పడుతుంది.

కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ యోగం
బుధుడు జూన్ 29వ తేదీ నుండి జులై 19వ తేదీ వరకు బుధుడు కర్కాటక రాశిలోనే కొనసాగుతాడు. ఇక జులై 7వ తేదీన లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

Double Lakshmi Narayana Yoga in July Double wealth for these zodiac signs

సింహరాశిలో లక్ష్మీ నారాయణ యోగం
అంతేకాదు జూలై 19 బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జులై 31న శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కూడా బుధ శుక్రుల కలయిక వల్ల రెండోసారి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ముఖ్యంగా జూలై నెలలో మూడు రాశుల వారికి డబుల్ ప్రయోజనాలను ఇస్తుంది.

కర్కాటక రాశి
జులై నెలలో ఏర్పడే డబుల్ లక్ష్మీనారాయణ యోగాల కారణంగా కర్కాటక రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి జాతకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.

సింహరాశి
జులై నెలలో ఏర్పడే డబుల్ లక్ష్మీనారాయణ యోగం కారణంగా సింహరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో ఐశ్వర్యం వచ్చి పడుతుంది. వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సంపద పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

వృశ్చిక రాశి
జులై నెలలో డబుల్ లక్ష్మీనారాయణ యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెళ్ళికాని వారికి వివాహ యోగం ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+