త్వరలో బుధుడి డబుల్ సంచారం.. వీరి ఇంట సంపదల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాల రాకుమారుడు బుధుడు అక్టోబర్ నెలలో రెండుసార్లు గ్రహ సంచారం చేయబోతున్నాడు. మొదట బుధుడు అక్టోబర్ 10వ తేదీన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆపై అక్టోబర్ 29వ తేదీన మళ్లీ బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతుంది.బుధుడు కమ్యూనికేషన్ కు, మేధస్సుకు ప్రతీక.
బుధుడి డబుల్ సంచారం
బుధుడి డబుల్ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. బుధుడు డబుల్ సంచారం కొన్ని రాశుల వారికి సువర్ణ యోగాన్ని పట్టించబోతుంది. వీరి మహా అదృష్టానికి, ఆర్ధిక ప్రయోజనాలకు కారణం అవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తులారాశి
అక్టోబర్ మాసంలో బుధుడు రెండుసార్లు రెండు రాశులలోనికి సంచారం చేయడం వల్ల తులా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతారు. తులారాశిలో బుధుడు ఉన్నత స్థానంలో ఉండటంతో ముఖ్యంగా కెరీర్ కి సంబంధించి వీరికి లబ్ధి జరుగుతుంది. జీవితంలో ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో వీరు లబ్ధిని పొందుతారు. ఇది వీరికి సువర్ణకాలం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. బుధుడి డబుల్ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పనులలో వచ్చే అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ సమయంలో బుధుడి డబుల్ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారి కెరీర్ లో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలు దూరం అవుతాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. ఆర్థికంగా అనేక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications