బుధుడి డబుల్ సంచారం.. ఈ రాశులవారికి రెట్టింపు ఐశ్వర్యం!
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల కదలిక కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. సెప్టెంబర్ నెలలో బుధుడు డబుల్ సంచారం చేయనున్నాడు. దృక్ పంచాంగం ప్రకారం బుధుడు సింహరాశిలోకి నాలుగవ తేదీన ప్రవేశించనున్నాడు. ఇక సెప్టెంబర్ 15వ తేదీన సూర్యుడుతో సంయోగం జరపనున్నాడు.
సెప్టెంబర్ లో డబుల్ ప్రయోజనాలను ఇచ్చే బుధుడు
ఆపై సెప్టెంబర్ 23వ తేదీన మళ్లీ బుధుడు కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సెప్టెంబర్ మాసంలో బుధుడు డబల్ సంచారం, సింహరాశిలో సూర్యుడుతో సంయోగం వల్ల కలిగే బుధాదిత్య రాజయోగం కారణంగా సెప్టెంబర్ మాసంలో బుధుడి వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సెప్టెంబర్ నెలలో బుధ గ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకుల ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి . వర్తక వ్యాపారాలు చేసే వారికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయి. ఈ సమయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది.కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం కేటాయిస్తే మంచిది. ఇది నిజంగా సానుకూల సమయంగా చెప్పవచ్చు.
తులారాశి
డబుల్ బుధ సంచారం కారణంగా తులా రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో తులారాశి వారికి ఆర్ధిక లాభాలు కలుగుతాయి. తులారాశి జాతకులు వ్యాపారాలలో నిలిచిపోయిన డబ్బులను మళ్ళీ తిరిగి పొందుతారు . రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ప్లాన్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సాఫీగా పూర్తవుతాయి.
ధనుస్సు రాశి
సెప్టెంబర్ మాసంలో జరిగే డబుల్ బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి డబుల్ శుభాలు చేకూరుతాయి. ధనుస్సు రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో ఈ సమయంలో భారీ లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications