ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పూజించకూడని హనుమంతుడి ఈ అయిదు రూపాలు
హిందూ ధర్మంలో దేవతా విగ్రహాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తులు తమ ఇళ్లలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, ఈ విగ్రహాలు దైవిక, ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.
ఇటువంటి విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి, ప్రతికూల వాతావరణం, వ్యతిరేక పరిస్థితులు, నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని నమ్మకం. అటువంటి విగ్రహాలు, ఫొటోలను పూజించినా, దానం ఇచ్చినా కొంత ప్రతికూల ఫలితాలే వస్తాయని చెబుతున్నారు.

శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే హనమంతుడికి సంబంధించిన కొన్ని ఫొటోలు, విగ్రహాలను ఇంట్లో ఉంచకపోవడమే శ్రేయస్కరమని చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా ఆంజనేయుడు తన ఛాతీని చీల్చుతున్నట్లు ఉన్న చిత్రాలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే అవి కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారితీస్తాయి.
అలాగే- కోపంతో ఉన్న హనుమంతుడి ఫొటోలు కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో ఉద్రిక్తతను పెంచుతాయి. సంజీవని పర్వాతాన్ని చేతిలో పట్టుకుని ఆంజనేయుడు గాలిలో ఎగురుతున్నట్లు ఉన్న ఫొటోలు లేదా విగ్రహాలు కూడా ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. వాటిని ఇంటికి దూరంగా ఉంచాలి. ఇవి అశాంతిని కలిగిస్తాయనేది వారి నమ్మకం.
అలాగే- లంకను దహనం చేస్తున్న హనుమంతుడి ఫొటోలు కూడా ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. అదేవిధంగా, ఆంజనేయుడు తన భుజాలపై రామలక్ష్మణులను మోస్తున్న ఫొటోలు లేదా విగ్రహాలు కూడా ఇంటికి మంచివి కావట. వీటిని బహుమతులుగా ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి, ఈ రకాల చిత్రాలను ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త వహించడం మంచిది.
ఇవి తప్ప ఆంజనేయుడికి సంబంధించిన ఇంకెలాంటి ఫొటోలు/విగ్రహాలు అయినా ఇంట్లో పెట్టుకోవచ్చని, వాటిని పూజించడం వల్ల శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తోన్నారు. గదాధారుడైన ఆంజనేయుడి రూపాన్ని ఇంట్లో పూజించడం వల్ల మనోబలం పెరుగుతుందని, ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుందని ఉవాచ.
అలాగే- లక్ష్మణ సమేత శ్రీసీతా రామచంద్రులవారితో కూడిన ఆంజనేయుడిని ఫొటోలు గానీ, విగ్రహాలను పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయని, రామనామ జపాన్ని చేస్తోన్న వాయుపుత్రుడి ఫొటోలను ఇంట్లో ఉంచుకుని, నిత్యం పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
సంకట మోచనుడిగా ఆంజనేయుడు ప్రశాంత రూపంలో కూర్చుని ఉన్న ఫొటోలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవచ్చు. దీనివల్ల రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి అడ్డంకులు ఎదురుకాబోవని నమ్ముతారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications