కనుబొమ్మలు మీ వ్యక్తిత్వాన్ని చెప్తాయి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి!!
మన గురించి మనకంటే అవతల మనల్ని చూసే వారికే బాగా తెలుస్తుంది. చాలాసార్లు మన సొంత వ్యక్తిత్వం ఎలాంటిదో మన ఆలోచన ఎలా ఉంటుందో సరిగ్గా చెప్పలేము. అయితే సాముద్రికా శాస్త్రంలో మన శరీరంపై ఉండే అనేక గుర్తుల ఆధారంగా అనేక విషయాలను చెప్తారు. అయితే మన శరీరంలోని కళ్ళు, ముక్కు, చెవులు వంటి శరీరభాగాలు వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి.
ప్రస్తుతం మనం కనుబొమ్మలు మన వ్యక్తిత్వాన్ని గురించి ఏం చెబుతాయి? ఎటువంటి కనుబొమ్మలు ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. కనుబొమ్మలు నిటారుగా లోతుగా ఉంటే భవిష్యత్తులో వారు గౌరవాన్ని పొందుతారని అర్థం. లోతైన కనుబొమ్మలు ఉన్నవారి పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వీళ్ళు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. చాలా మొండిగా కూడా ఉంటారు.

చిన్న లేదా తేలికపాటి కనుబొమ్మలు కలిగిన వ్యక్తులు మంచి దృఢసంకల్పంతో ఉంటారు. అటువంటి వారికి సహనం చాలా తక్కువ, కోపం చాలా ఎక్కువగా ఉంటుంది.వారి జీవితంలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకుంటారు. వారి మనసు ఒక చోట నిలకడగా ఉండదు.
ఇక కనుబొమ్మలు కలిసి ఉంటే ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటే అటువంటి వారు ఏదైనా పని చేస్తే దానిని వెంటనే నమ్మరు. పని పూర్తి అయిన తరువాత మాత్రమే దానిని నమ్ముతారు. ఎటువంటి సవాళ్లనైనా వీళ్లు చాలా దృఢంగా ఎదుర్కొంటారు. వీరు మనసుకు అస్సలు విశ్రాంతిని ఇవ్వకుండా పని చేస్తూ ఉంటారు.
ఇక వంకర కనుబొమ్మలు ఉన్నవారు వారి జీవితంలో అనేకసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తప్పు చేసి తరువాత పశ్చాత్తాప పడటం వీరి నైజం. అయితే కూర్చునే పని పూర్తి చేసే గుణం కలిగిన వారై ఉంటారు. వీరు కొన్నిసార్లు చాలా ఒంటరిగా ఫీలవుతారు. వీరికి స్నేహితులు ఉండరు.
అంతేకాదు కనుబొమ్మల రంగు కూడా వ్యక్తిత్వాన్ని ఇట్టే తెలియజేస్తుంది. కనుబొమ్మల రంగు బ్రౌన్ గా, కనుబొమ్మలు డార్క్ గా ఉంటే కరడుగట్టిన స్వభావం కలిగి ఉన్నారని అర్థం. అంతేకాదు అటువంటివారు త్వరగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లు చాలా భావోద్వేగంగా కూడా ఉంటారు. కనుబొమ్మల రంగు లేత రంగులో ఉంటే అటువంటి వారు ఆలోచనాపరులని చెబుతారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications