దీపావళికి గజకేసరి రాజయోగంతో వీరికి సిరిసంపదలు ఇచ్చిన బృహస్పతి చంద్రులు!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేది యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి మంచిని చేయగా కొన్ని రాశుల వారికి కష్టాలను, నష్టాలను ఇస్తాయి. అయితే కొన్ని రాజయోగాలు దాదాపు చాలా రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తాయి.
గజకేసరి రాజయోగం
ప్రస్తుతం వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. ఇక అదే వృషభ రాశిలో ప్రస్తుతం దేవగురువు బృహస్పతి గ్రహ సంచారం కూడా జరుగుతుంది. ఈ రెండు రాశుల సంయోగంతో అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది ఈ సంవత్సరం గజకేసరి రాజయోగం అక్టోబర్ 19వ తేదీన ఏర్పడింది ఇది కొన్ని నెలలపాటు కొనసాగనుంది.ఇక గజకేసరి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేషరాశి
మేష రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా ఈ సమయంలో అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో సంతోషం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. ఈ సమయం నిజంగా మేష రాశి జాతకులకు శుభ సమయం.
కన్య రాశి
గజకేసరి రాజయోగం కారణంగా కన్యా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఇది కన్యారాశి జాతకులకు శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కన్యా రాశి జాతకులు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు.
తులారాశి
తులా రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ సమయంలో చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. తులా రాశి జాతకులు మానసికంగా ప్రశాంతతను పొందుతారు.ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తారు.ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలలో విజయాలు సాధ్యమవుతాయి. ఇది తులా రాశి వారికి నిజంగా అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications