జూన్ 15 నుంచి ఈ రాశులకు మహర్దశ
సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి రాశిని మారుస్తాడు. ఇలా ఏడాది మొత్తంమీద 12 రాశుల్లోను సంచరిస్తాడు. దీన్ని సంక్రాంతి అంటారు. ప్రస్తుతం సూర్యుడు వృషభరాశిలో ఉన్నాడు. ఈనెల 15వ తేదీన సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది బుధుడి రాశి. దీన్ని మిథున సంక్రాంతి అంటారు. సూర్యుడి సంచారం నాలుగు రాశులవారికి అదృష్టాన్ని తేబోతోంది. ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో పరిశీలిద్దాం.
మేషరాశి : ఈ రాశివారికి అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి. వ్యాపారంతోపాటు ఉద్యోగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. డబ్బులు రెట్టింపవుతాయి. దీనివల్ల ధైర్యం పెరెగి పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. పెట్టే పెట్టుబడి ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు.

సింహ రాశి : సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్యడి సంచారం ఈ రాశివారికి ఎప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంటుతోపాటు పదోన్నతి కూడా వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి మీ పరమవుతుంది.
కన్యారాశి : వీరు ఎలాంటి పనుల్లోనైనా విజయాన్ని పొందుతారు. విదేశాల్లో స్థిరపడాలనే వీరి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. కెరీర్ లో ముందుకు సాగుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
కుంభ రాశి : సూర్యుడి సంచారం ఈ రాశివారికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగంలో ఉన్నవారికి వేతనం పెరుగుతుంది. తద్వారా ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఆత్మవిశ్వాసపుస్థాయులు పెరిగి కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది.












Click it and Unblock the Notifications