ఏప్రిల్ లో వీరికి చుక్కలు చూపించనున్న నాలుగు ప్రమాదకర గ్రహాల కలయికలు.. జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలానే గ్రహ సంచారాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్ మాసంలో మనసు కారకుడైన చంద్రుడు ఆత్మకారకుడైన సూర్యుడు భూమి పుత్రుడైన కుజుడు తమ రాశీ చక్రాలను మార్చుకుంటారు. ఇది ప్రమాదకరమైన యోగాలను సృష్టిస్తుంది. ఏప్రిల్ మాసంలో గ్రహాలు సంచారం కారణంగా మూడు ప్రమాదకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
శని బుధ గ్రహాల సంయోగం
శని ప్రస్తుతం పూర్వాభాద్ర నక్షత్రంలో, మీన రాశి లోఉన్నాడు. ఏప్రిల్ మూడవ తేదీన బుధుడు కూడా శని సంచరిస్తున్న మీనరాశిలోకి వస్తాడు. దీని కారణంగా శని బుధ గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. మీనరాశిలో బుధుడు శని గ్రహాలు కలయిక ముఖ్యంగా సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. వీరు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

సూర్యుడు మరియు శని సంయోగం
సూర్యుడు మార్చి 14వ తేదీ నుండి మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఇక మార్చి 29వ తేదీన శని కూడా మీనరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు మరియు శని కలయిక ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో ఉంటుంది. ఫలితంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేషరాశి, సింహరాశి, కన్యారాశి, ధనుస్సురాశి మరియు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
సూర్య, శుక్ర, శని సంయోగం
ఏప్రిల్ నెలలో మీన రాశిలో సూర్యుడు, శుక్రుడు మరియు శని కలయిక ఏర్పడుతుంది. మీనరాశిలో శుక్రుడు, శని మరియు సూర్యుడి కలయిక ఏప్రిల్ 14వ తేదీవరకు కొనసాగుతుంది. మీనరాశిలో ముగ్గురి కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీనరాశి, తులారాశి, ధనుస్సురాశి వారు ఏప్రిల్ 14వతేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. శారీరక, మానసిక సమస్యలతో పాటు వైవాహిక జీవితం కూడా ఈ సమయంలో ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.
శుక్ర కుజ సంయోగం
శుక్రుడు మే 31వ తేదీ వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక కుజుడు కూడా జూన్ 29వ తేదీ వరకు మీన రాశి లోనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మీనరాశిలో శుక్ర కుజ గ్రహాల సంయోగం జరుగుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి 2025 లో సంభవించే కుజ శుక్రుల కలయిక వల్ల కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications