ఆగస్ట్ నెలలో వీరికి సంపదల మూటలను మోసుకొస్తున్న నాలుగు గ్రహాలు!!

ఆగస్టు నెల రానే వచ్చింది. ఆగస్టు నెలలో ముఖ్యమైన గ్రహాలు సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు సంభవించబోతున్నాయి. ఆగస్టులో సూర్యుడు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు మొదలైన గ్రహాల రవాణా, ఆయా గ్రహాల సంయోగం కొన్ని శుభయోగాలను, కొన్ని అశుభయోగాలను కలుగజేస్తున్నాయి. ఇక ఆగస్టు నెలలో గ్రహాల రవాణా గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఆగస్ట్ లో ముఖ్య గ్రహాల రవాణా
ఆగస్టు నెల ప్రారంభంలో ఆగస్టు 5వ తేదీన సింహరాశిలో బుధ గ్రహ తిరోగమనం జరగబోతుంది. ఇది సింహ రాశిలో ఉన్నప్పుడే ఆగస్టు 12వ తేదీన బుధ గ్రహ దహనం జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి ఉదయిస్తుంది. ఆపై ఆగస్టు 16వ తేదీన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

Four planets will bring wealth to these zodiac signs in August

బుధ, శుక్ర, కుజ సంచారం
దీంతో అప్పటికే సింహరాశిలో ఉండే బుధుడు, సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆపై బుధుడు ఆగస్టు 22వ తేదీన తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి వెళతాడు. ఇక ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 26వ తేదీన కుజుడు మిధున రాశిలో సంచరిస్తాడు.

బృహస్పతి నక్షత్ర మార్పు.. ఏర్పడే యోగాలు
ఇక ఆగస్టు చివరలో ఆగస్టు 29వ తేదీన బుధుడు మొదట కర్కాటక రాశిలో ఉదయిస్తాడు. ఆగస్టు మాసంలోనే బృహస్పతి రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రం లోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు నెలలో బుధాదిత్య రాజయోగం, సంసప్తక రాజయోగం, సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నాయి.

ఈ రాశులవారికి అద్భుత ఫలితాలు
ఆగస్టు మాసంలో జరిగే గ్రహాల రవాణా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఆగస్టు నెలలో సింహరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి వారికి ఈ ప్రధాన గ్రహాల మార్పు కారణంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తారని జీవితంలో పురోగతి ఉంటుందని నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+