Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిసెంబర్ నెలలో వివిధ రాశులవారి దశను మార్చే నాలుగు రాజయోగాలు!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెల చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న నెల. డిసెంబర్ నెలలో నాలుగు ముఖ్యమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కదలికలను బట్టి, గ్రహాల కలయికలను బట్టి అనేక యోగాలు సంభవిస్తాయి. కొన్ని యోగాలు శుభాలను, మరికొన్ని యోగాలు అశుభాలను సూచిస్తాయి.

కానీ డిసెంబర్ నెలలో నాలుగు యోగాలు సంభవించనుండగా, ఆ నాలుగు యోగాలు శుభ యోగాలు కావడం విశేషం. ప్రస్తుతం మనం శుభ యోగాల గురించి తెలుసుకుందాం. డిసెంబర్ నెలలో కుజుడు, శని, శుక్రుడు, గురుడు, చంద్రుల కలయిక రాజ యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ యోగాల ప్రభావం కొన్ని రాశులకు శుభాలను అందిస్తుంది. వారి అదృష్టం మెరుస్తుంది.

 Four Raja Yogas that change the phase of different zodiac signs in the month of December!!

డిసెంబర్ నెలలో కుజుడు రుచక్ రాజ యోగాన్ని సృష్టిస్తే, శని శష రాజ యోగాన్ని సృష్టిస్తున్నాడు. శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఏర్పాటు చేస్తే, గురుడు చంద్రుడు కలయిక గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఒకే నెలలో నాలుగు శుభ యోగాలు రావటం విశేషం.

వేద జ్యోతిషశాస్త్రంలో రుచక్ రాజయోగం ఒక అనుకూలమైన గ్రహ కలయికగా చెబుతారు. ఈ రాజ యోగం నాయకత్వ లక్షణాలను, బలాన్ని సూచిస్తుంది. ఈ యోగం వల్ల రాశుల వారిలో ధైర్యం, దృఢ నిశ్చయం, చైతన్యవంతమైన వ్యక్తిత్వం కలుగుతాయి. శష రాజయోగం అనేది విజయం మరియు శ్రేయస్సు తో ముడిపడి ఉన్న శక్తివంతమైన జ్యోతిష్య కలయిక. ఈ రాజయోగం క్రమశిక్షణను, కష్టపడి పనిచేసే తత్వాన్ని, పట్టుదలను, బాధ్యతాయుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది.

ఇక మాలవ్య రాజయోగం తో విలాసవంతమైన, ఆకర్షణీయమైన జీవితం దక్కుతుంది. సౌకర్యవంతమైన జీవన శైలిని ఈ యోగం అందిస్తుంది. ఈ యోగం వల్ల వివిధ రాశి చక్ర జాతకులకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గజకేసరి రాజయోగం అనేది జ్ఞానాన్ని, శ్రేయస్సును, ప్రజాదరణను సూచించే ఒక రాజయోగం. ఈ యోగం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక అంతర్దృష్టి పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+