డిసెంబర్ 30 నుండి పూర్వాషాడ నక్షత్రంలో శుక్ర సంచారంతో వీరికి జాక్ పాట్!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతి. అటువంటి శుక్రుడు డిసెంబర్ 20వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు డిసెంబర్ 30వ తేదీన పూర్వాషాడ నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు. పూర్వాషాడ నక్షత్రానికి శుక్రుడు అధిపతి.
శుక్ర నక్షత్ర సంచారం
శుక్రుడు తన సొంత నక్షత్రంలో చేసే సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. శుక్ర నక్షత్ర సంచారం కొన్ని రాశులవారికి భారీ సంపదలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా శుక్ర సంచారం మేషరాశి, తులా రాశి, ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా అదృష్టవంతులు అవుతున్న రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
శుక్ర సంచారం మేష రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. కొత్త కెరీర్ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు గణనీయమైన లాభాలను చూస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారు లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇది మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే కాలం.
తులారాశి
శుక్రుడి నక్షత్ర మార్పు తులా రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తులా రాశి వారు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పొందుతారు. చేసే పనిలోనూ, వ్యాపారాలలోనూ పురోగతిని చూస్తారు. వ్యాపారవేత్తలకు మంచి ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది అన్ని విధాలా తులారాశికి మంచి సమయం.
ధనుస్సు రాశి
శుక్రుడి నక్షత్రం మార్పు ధనుస్సు రాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వివాహము, ప్రేమ జీవితానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని విధాల ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications