జులై 6నుండి వీరికి ధలక్ష్మీ కటాక్షం.. చాతుర్మాసంలో నక్కతోక తొక్కే రాశులివే!

జూలై ఆరవ తేదీ నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. చాతుర్మాసాన్ని మహావిష్ణువుకి అంకితం చేయబడిన మాసంగా చెబుతారు. చాతుర్మాస మొదటి రోజు నుండి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు అని చెబుతారు. ఇక ఆ రోజు నుంచి నాలుగు నెలల కాలం చాలా పవిత్రమైన నెలలుగా జరుపుకుంటారు. ఈ చాతుర్మాస కాలంలో ముఖ్యంగా 6రాశులవారు వివిధ గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందుతున్నారు. మరి ఆ రాశులేమిటి అనేది తెలుసుకుందాం.

మేషరాశి
చాతుర్మాస కాలంలో మేషరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో మేష రాశి వారికి ఇల్లు లేదా ప్లాటు కొనుక్కోవాలనే కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగం కోసం చూసేవారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఇది మేష రాశి జాతకులకు సమస్యలు తీరే సమయం. శ్రీమహావిష్ణువు కటాక్షంతో వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.

From July 6th these zodiac signs will be blessed with Goddess Lakshmi during the month of Chaturmas

మిధున రాశి
చాతుర్మాస కాలంలో మిధున రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. మిధున రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసిన మంచి ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి సమస్యను సమన్వయంతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.

సింహరాశి
చాతుర్మాస కాలం సింహరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. నూతన ఒప్పందాల నుండి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది మంచిసమయం. సొంత వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనాలు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

తులారాశి
చాతుర్మాస కాలం తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఏ పని చేసిన లాభాలు వస్తాయి. ఒప్పందాల నుంచి ఆదాయం వస్తుంది. ఇది మీకు మంచి ఫలితాలు ఇచ్చే సమయం.

మకర రాశి
చాతుర్మాస కాలం మకర రాశి జాతకులకు అదృష్ట కాలం. ఈ సమయంలో మకర రాశి జాతకులకు జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. కష్టించి పని చేసే వారికి సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసిన కలిసొస్తుంది. వివిధ ఒప్పందాల నుండి లాభాలు వస్తాయి.

మీన రాశి
మీన రాశి వారికి చాతుర్మాస కాలం కలిసి వస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో డబ్బు కష్టాలు తీరి సంతోషంగా జీవిస్తారు. మీన రాశి వారు కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వివిధ ఒప్పందాల నుండి లాభాలు వస్తాయి. వివిధ పెట్టుబడుల నుండి ఆదాయం వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడపవచ్చు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+