కార్తీక పౌర్ణమి... నేటినుండి ఈ రాశుల ఇంట కాసుల పంట!

కార్తీక పౌర్ణమి నేడు.. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన రోజు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు జ్యోతిష్య పరంగాను కార్తీకమాసానికి, అందునా కార్తీక పౌర్ణమి కి తనదైన ప్రాధాన్యత ఉంది కార్తీక పౌర్ణమి నాడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి లబ్ధి జరుగుతుంది.

కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్
కార్తీక పౌర్ణమి కొన్ని శుభ యోగాలకు కూడా కారణం అవుతుంది కార్తీక పౌర్ణమి నాడు గజకేసరి రాజయోగం, శశ రాజయోగం ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. నేడు నవంబర్ 15వ తేదీన శని నేరుగా కుంభరాశిలో సంచారం చేయనుంది. ఇక ఇదే సమయంలో బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తుంది. ఇక నేడు లబ్ది పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

From Kartika Pournami these zodiac signs will get golden life and wealth

మేషరాశి
కార్తీక పౌర్ణమి రోజున మేష రాశి వారికి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది.

వృషభరాశి
కార్తీక పౌర్ణమి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు మొదలవుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించి వృషభ రాశి వారు ముందుకు వెళతారు. కార్తీక పౌర్ణమి నుండి వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమితో వీరికి ఉన్న చెడు సమయం కాస్త ముగుస్తుంది.

కర్కాటక రాశి
కార్తీక పౌర్ణమి నుండి కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. మీరు వర్తక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి వారి కెరీర్లో పురోగతిని సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి
కార్తీక పౌర్ణమి నుండి మకర రాశి జాతకులు గ్రహాల సంచారం కారణంగా భగవంతుని ఆశీస్సులను పొందుతున్నారు. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయం మకర రాశి లో ఉన్న విద్యార్థులకు శుభ సమయం. ఉద్యోగస్తులకు ఇది నిజంగానే శుభ సమయం.

వృశ్చిక రాశి
కార్తీక పౌర్ణమి నుండి వృశ్చిక రాశి వారి సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. వ్యాపార విస్తరణ చేపడతారు. నూతనంగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు ఒత్తిళ్ళు తొలగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు.

కన్యా రాశి
కార్తీక పౌర్ణమి నాడు కన్యారాశి జాతకులకు కలిసొస్తుంది. కన్యారాశి వారి భాగ్యస్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఏ నిర్ణయాలు తీసుకున్న తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+