శుక్రుడి సంచారంతో మే 30 నుంచి ఈ రాశులవారు కుబేరులే

జ్యోతిష్యంలో శుక్రుడికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యానికి కారకుడు. శుక్ర సంచారం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. కొన్ని రాశులవారు ప్రతికూలతను ఎదుర్కొంటే మరికొన్ని రాశులవారు సానుకూలతను చవిచూస్తారు. ఈనెల 30వ తేదీన మిథునరాశిని వదిలి కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు. దీనివల్ల 4 రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏరాశివారికి కలిసిరానుందో తెలుసుకుందాం.

మేషరాశి : ఈ రాశివారి జీవితం సంతోషంగా గడుస్తుంది. శుక్రుడి సంచార క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసినా విజయం సాధిస్తారు. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లభించడంతోపాటు వేతనం కూడా పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి అంతా సానుకూలంగా ఉంటుంది.

horoscope2

కర్కాటక రాశి : వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భవిష్యత్తులో కూడా మంచి లాభాలను పొందుతారు. పనిచేసేచోట వీరి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడమే కాక జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషానికి కారణమవుతుంది.

వృశ్చిక రాశి : ఈనెల 30వ తేదీ నుంచి అన్నీ శుభవార్తలే వింటారు. కోరుకున్న కోరికలన్నీ చిన్న ప్రయత్నం చేతనే నెరవేరతాయి. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు శుక్రుడి సంచారం వల్ల లాభపడతారు. అన్నివిధాలుగా కలిసివస్తుంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది.

మీన రాశి : ఈరాశి వారికి 5వ స్థానంలో సంచారం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. రాబోయే కాలంలో వీరికి అన్నీ ప్రయోజనాలే ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+