అక్టోబర్ 29 నుండి వీరికి డబ్బుల మూటలు సిద్ధం చేసిన మూడు గ్రహాలు!

నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం, అత్యంత శక్తివంతమైన గ్రహం శనిగ్రహం. అయితే శని జాతకంలో ఉంటే చెడు ఫలితాలు వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ వ్యక్తి జీవితాన్ని బాగు చేసేది శని గ్రహం మాత్రమే. జీవితంలో కష్టాలను ఇచ్చినప్పటికీ వాటిని సహించే ఓర్పును వాటి నుండి బయటపడే నేర్పును క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఇచ్చే దేవుడిగా శనికి గుర్తింపు ఉంది.

బుధ, శుక్ర, శని గ్రహాల యుతి
ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ నెల 29వ తేదీ నుండి నవంబర్ ఆరవ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు వృశ్చిక రాశిలో యుతి చెందనున్నాయి. ఈ సమయంలో కుంభ రాశిలో ఉన్న శని పూర్ణ దృష్టి ఈ గ్రహాలపైన పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

From October 29th saturn venus mercury planets have prepared bundles of money for these zodiac signs

వృషభ రాశి
బుధ, శుక్ర, శని గ్రహాల యుతికారణంగా వృషభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు చేసే పనులు విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో గుర్తింపు వస్తుంది.

సింహరాశి
సింహ రాశి వారికి బుధ, శుక్ర, శని గ్రహాల యుతి కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.

తులారాశి
బుధ, శుక్ర, శని గ్రహాల యుతి తులా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ పది రోజులు తులా రాశి వారు రాజభోగాలను అనుభవిస్తారు. తులా రాశి వారికి ఈ మూడు గ్రహాలు అత్యంత అనుకూలమైన గ్రహాలు కావడం వల్ల ఆదాయం కలిసి వస్తుంది. మీరు ఏ పని తలపెట్టిన విజయవంతం అవుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.

మకర రాశి
మకర రాశి వారికి శనీశ్వరుడు ధనస్థానంలో సంచరించడం వల్ల లాభ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు ఉండడం వల్ల, ఈ మూడు గ్రహాల యుతి కారణంగా ఆదాయం కలిసొస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి లబ్ధి జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది.

కుంభరాశి
శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక కుంభ రాశిలో దశమ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలతో శనికి యుతి ఏర్పడడం వల్ల కుంభ రాశి వారి ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు లాభాలను చేకూరుస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+