రాఖీపౌర్ణమి నుండి ఈ రాశులవారికి జాక్ పాట్.. భారీ బహుమతిచ్చిన బుధుడు!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసే సమయంలో వివిధ రాశులతో సంయోగం జరుపుతూ ఉంటాయి. ఇక ఆగస్టు నెలలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.
రాఖీ పౌర్ణమి నాడే కర్కాటక రాశిలో బుధుడు
ముఖ్యంగా ఆగస్టు మాసం శ్రావణమాసం కావడం, ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు రావడం వంటి కారణాలు కూడా వివిధ రాశుల వారికి శుభాలను చేకూరుస్తాయి. నేడు రాఖీ పౌర్ణమి. అంతేకాదు ఈరోజు శ్రవణ, ధనిష్ఠ నక్షత్రాల కలయిక జరగబోతుంది. బుధుడు కర్కాటక రాశిలో ఉదయించాడు. ఇక సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది .ఈ అన్ని శుభ పరిణామాల కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి
రాఖీ పండుగ నాటినుండి వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. విలాసాలకు సంపదలకు అధిపతి అయిన శుక్రుడు బుధ గ్రహంతో స్నేహపూర్వకంగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. బుధుని ఉదయంతో ఈ రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటక రాశి
రాఖీ పండుగ నుండి కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రునికి, బుధునికి స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. కనుక కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి . కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది కర్కాటక రాశి వారికి మంచి సమయం. కర్కాటకరాశి జాతకులు ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలను చేస్తారు.
వృశ్చిక రాశి
రాఖీ పండుగ నుండి వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. అన్ని విషయాలలోనూ పురోగతిని సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇది వృశ్చిక రాశి వారికి శుభ సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications