ఈ దీపావళి నుండి మళ్ళీ దీపావళి వరకు.. ఈ రాశులవారి పంట పండినట్టే!!
దీపావళి పండుగ సంతోషాన్ని తీసుకు వచ్చే పండుగ. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగ కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ దీపావళి పండుగ నుండి, వచ్చే సంవత్సరం దీపావళి పండుగ నాటి వరకు కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెబుతున్నారు.

దీపావళి పండుగ నుండి మళ్ళీ దీపావళి వరకు కలిసొచ్చే రాశులు ఇవే
ఇంతకీ దీపావళి పండుగ నుండి అదృష్ట లక్ష్మి వరించే ఆ రాశుల వివరాల్లోకి వెళితే.. ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు 6 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దీపావళి పండుగ నుండి కన్యారాశి, మేష రాశి, తులారాశి, ధనుస్సు రాశి, మకర రాశి, మీన రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

తులా రాశి వారు ఇప్పటి నుండి పట్టిందల్లా బంగారమే
ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు తులా రాశి వారికి బాగా కలిసొస్తుందని, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి, డబ్బు పుష్కలంగా సమకూరుతుందని, వారి వృత్తి వ్యాపారాలలో పురోగతి సిద్ధిస్తుందని, గొప్ప విజయం వారిని వరిస్తుందని చెబుతున్నారు. ఈ దీపావళి నుండి తులా రాశి వారి జీవితం లో అనేక మార్పులు సంభవించవచ్చు అని సూచిస్తున్నారు. దీపావళి తర్వాత వారి సొంత ఇంటి కల కూడా నెరవేరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

మేషరాశి వారికి అదృష్టం ఎలా ఉందంటే
ఇక మేష రాశి వారికి కూడా దీపావళి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మేష రాశి వారు ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు అనుకున్న పనులు చేయడంలో సఫలీకృతం అవుతారని చెబుతున్నారు. వారి సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారమవుతాయని, నూతన వాహన, వస్తు, గృహయోగం వారికి ఉందని చెబుతున్నారు. ఆర్థికంగా ఈ సంవత్సరం వారు బలంగా ఎదుగుతారని సూచిస్తున్నారు.

కన్యా రాశి వారికి ఇప్పటి నుండి ఇలా..
దీపావళి తర్వాత కన్యా రాశి వారికి మంచి జరుగుతుందని చెప్తున్నారు. కన్యా రాశి వారికి ఈ ఏడాది ఇప్పటి నుండి వచ్చే దీపావళి వరకు బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ బదిలీలతో వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఈ రాశి వారు శివుడిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. మొత్తంగా ఈ రాశివారి జీవితం నేటి నుండి కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు.

ధనుస్సు రాశి వారికి ఆర్ధికంగా ఇలా ఉండే ఛాన్స్
ధనుస్సు రాశి వారికి ఇప్పటి నుండి అదృష్ట లక్ష్మి వరిస్తుందని చెప్తున్నారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆర్ధికంగా బాగా కలిసివస్తుందని అంటున్నారు. వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి నుండి జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పండితులు చెప్తున్నారు. దైవారాధన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది.

మీన రాశికి కలిసొచ్చే అంశాలివే
ఈ దీపావళి మీన రాశి వారికి అదృష్టం తెచ్చి పెడుతుంది. ఈ సంవత్సరం వీరికి కొత్త ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. అప్పులు, ఆర్ధిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి శని మంత్రం జపం చేస్తే సమస్యల నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది.

మకర రాశి వారికి నేటి నుండి మంచి ఫలితం
ఇక మకర రాశి వారికి ఈ దీపావళి నుండి మంచి ఫలితం వస్తుందని చెప్తున్నారు. మకర రాశి వారు ఇప్పటి నుండి డబ్బు సంపాదనలో వెనకడుగు వెయ్యరు. ఆర్ధికంగా వీరికి లాభిస్తుంది. మకర రాశి వారి ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. ఇక ఈ రాశి వారు శనిని పూజించటం వల్ల సమస్యల పరిష్కారం అవుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications