విశేష యోగం... నేటినుండి వీరికి ధనపు రాశులను కటాక్షించిన శని!
వేద జ్యోతిష శాస్త్రంలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిదేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. ఆయనను న్యాయదేవతగా, కర్మదేవతగా, ధర్మానికి ప్రతీకగా చెబుతారు. అటువంటి శనిదేవుని కటాక్షం ఉంటే ఎలాంటివారికైనా కష్టాలు ఇట్టే తొలగిపోతాయి. అలా కాకుండా శనిదేవుడి ఆగ్రహం ఉంటే జీవితం దుర్భరంగా మారుతుంది.
శతభిష నక్షత్రంలో రాహు శని కలయిక
నేడు శని దేవుడు శతభిషా నక్షత్రం లోకి అడుగుపెడుతున్నాడు. నేటి నుంచి డిసెంబర్ 27వ తేదీ రాత్రి వరకు శని దేవుడు శతభిషా నక్షత్రం లోనే సంచరిస్తాడు. శతభిషా నక్షత్రం రాహువు కి చెందిన నక్షత్రం. శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి కావడంతో గ్రహమైత్రి రీత్యా శని రాహువులు బద్ధ శత్రువులు. అయితే శతభిషా నక్షత్రంలో శని సంచారం కొన్ని రాశుల వారికి విశేష యోగాలను అదృష్టాన్ని తీసుకువస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి శని నక్షత్రం మార్పు వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వ్యాపారస్తులు ఈ సమయంలో అధిక లాభాలను అందుకుంటారు. పనులకు సంబంధించిన ప్రయాణాలు లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మేష రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని గ్రహ నక్షత్ర సంచారం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృషభ రాశి జాతకులు కెరీర్ లో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి ఇదే సమయం. వీరు జీవితంలో విజయాలను కూడా అందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి శని శతభిషా నక్షత్రం లోకి ప్రవేశించడం వలన గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. ఈ సమయంలో సింహరాశి వారి వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని శతభిషా నక్షత్ర ప్రవేశం వలన నేటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశుల వారు అనుభవించే అన్ని కష్టాలు తీరిపోతాయి. ధనుస్సు రాశి వారికి కీర్తి, డబ్బు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి అదృష్ట కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications