నేటినుండి ఆగస్ట్ 30వరకు బుధుని దయతో ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు నేడు ఆదివారం రోజు రాత్రి 9:33 నిమిషాలకు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. నేటి నుంచి బుధుడి రవాణా ఆగస్టు 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో కొనసాగుతుంది. ఈ సమయంలో బుధుడు కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలను కలిగిస్తున్నాడు.
బుధ సంచారంతో అదృష్ట రాశులు
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ స్నేహానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి గ్రహం. అటువంటి బుధుడు నేడు కర్కాటక రాశిలోకి సంచరించడం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి నక్క తోక తొక్కినంత అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహ రాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఏ పని చేసిన సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. సమాజంలో వీరికి గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా పురోగతి ఉంటుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులు కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వీరి వైవాహిక జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది. వీరు అనేక రకాలైన పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలను పొందుతారు. వీరి ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే కాలం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు బుధ సంచారం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఏ సమస్య అయినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులకు ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఏ పని చేసిన ఈ సమయంలో సానుకూల ఫలితాలే వస్తాయి. ఇది వృశ్చిక రాశి వారికి అన్ని విధాల లబ్ధిని చేకూర్చే సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications