నేటినుండి సెప్టెంబర్ 17వరకు ఈ రాశులవారికి జాక్ పాట్.. వరమిచ్చిన సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో గ్రహాల రాజుగా భావించే సూర్యుడికి అందరి జాతకాలలోను ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారిపై కటాక్షం చూపిస్తాడు. సూర్యుడు సింహరాశి సంచారం అన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. జాతకంలో సూర్యుడు కారణంగా శుభయోగం ఉంటే మంచి ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, కార్లు వంటివి సమకూరుతాయి.
నేటి నుండి సింహరాశిలో నెలరోజులు సూర్య సంచారం
ప్రస్తుతం సూర్యుడు ఆగస్టు 17వ తేదీన ఆదివారం అర్ధరాత్రి ఒక ఒంటిగంట 41 నిమిషాలకు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే నేడు సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు సింహరాశిలో సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి సూర్యుని సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఇది మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధాలలో ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు
మిధున రాశి
మిధునరాశి వారికి సూర్య సంచారం కారణంగా నెలరోజుల పాటు కలిసి వస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మిధున రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది ఆర్థికపరమైన విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు . డబ్బును ఆదా చేస్తారు. అన్ని పనులలోను చురుగ్గా పాల్గొంటారు.
సింహరాశి
సింహరాశిలో సూర్య సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నెలరోజుల పాటు వీరికి సుఖ సంతోషాలు కలుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. కొందరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. విజయానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇది వీరికి అదృష్ట సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో సూర్యుడు తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయనున్న నేపథ్యంలో వీరి జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. తోడబుట్టిన వారి మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications